Monday, December 23, 2024

నదిలో కొట్టుకుపోయిన కారు..మహిళను కాపాడిన స్థానికులు(వైరల్ వీడియో)

- Advertisement -
- Advertisement -

న్యూస్ డెస్క్: కారుతో సహా నదిలో కొట్టుకుపోయిన ఒక మహిళను స్థానికులు అత్యంత ధైర్యసాహసాలు ప్రదర్శించి కాపాడిన సంఘటన హర్యానాలోని పంచకులలో ఆదివారం చోటుచేసుకుంది. నది ఒప్పంగడంతో నది ఒడ్డునే నిలిపిఉన్న కారులో డ్రైవరింగ్ సీట్లో కూర్చుని ఉన్న మహిళ కారుతో సహా కొట్టుకుపోయింది.

నదిలో కొట్టుకుపోయిన కారును ఖరక్ మంగోలి సమీపంలో గుర్తించిన స్థానికులు వెంటనే తాళ్ల సాయంతో అక్కడకు చేరుకుని ఆ మహిళను కారులో నుండి బయటకు తీసి ప్రాణాలు కాపాడారు. పంచకులలోని సెక్టార్ 6 ఆసుపత్రిలో చేర్పించి ఆ మహిళకు చికిత్స అందచేస్తున్నారు. నదిలో కొట్టుకుపోతున్న కారులోని మహిళను స్థానికులు కాపాడుతున్న దృశ్యాలతో కూడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News