వికారాబాద్ జిల్లాలో కొట్టుకుపోయిన నవదంపతులు, మరో ముగ్గురు ప్రయాణిస్తున్న కారు
వరుడు, అతని సోదరి సురక్షితం
రంగారెడ్డి జిల్లా శంకర్‌పల్లిలో మరో ఘటన
ఒకరు గల్లంతు, ఒడ్డుకు చేరిన నలుగురు
మన తెలంగాణ/ వికారాబాద్ జిల్లా / మర్పల్లి /శంకరపల్లి: వికారాబాద్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగి పొర్లాయి. ఆదివారం సా యంత్రం కురిసిన భారీ వర్షాల కు మర్పల్లి మండలం రావులపల్లి గ్రామానికి చెందిన నవాజ్‌రెడ్డితో పాటు మరో నలుగురు ప్రయాణిస్తున్న కారు మోమిన్‌పేట్ మీదు గా రావులపల్లి వెళుతుండగా తిమ్మాపూర్ వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకుపోయినట్లు స్థానికులు తెలిపారు. కొట్టుకుపోయిన కారులో నవ దంపతులతో పాటు వారి ఇద్దరు బంధువులు, డ్రైవర్ ఉన్నట్లు తెలిసింది. నవదంపతులు నవాజ్‌రెడ్డి, ఆయన భార్య ప్రవళిక, నవాజ్‌రెడ్డి అక్కలు రాధమ్మ, శృతి, డ్రైవర్ రాఘవేందర్ రెడ్డిలు ఉన్నారని స్థానికులు తెలిపా రు. నవాజ్‌రెడ్డి, రాధమ్మ వరదలోను ంచి బయట పడినారు. వికారాబాద్ జిల్లా నవాబ్ పేట్ మండలం పుల్ మామిడి గ్రామానికి చెందిన చాకలి శ్రీను (40) సాయంత్రం నుండి కురుస్తున్న భారీ వర్షానికి పుల్ మామిడి గ్రామంలో హనుమాన్ మందిరం సమీపంలో గల ఉదృతంగా ప్రవహిస్తున్న వాగులో కొట్టుకొని పోవడం జరిగింది. మర్పల్లి మండలం సిరిపురం వాగులో మోటార్ బైక్ పై వెళ్తున్న ఇద్దరు గల్లంతు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
మరో ప్రమాదంలో ఒకరు గల్లంతు, నలుగురికి తప్పిన ప్రమాదం
వాగు ఉధృతిలో కారు కొట్టుకునిపోయి ఒకరు గల్లంతు కాగా నలుగురు బయటపడ్డ సంఘటన ఆదివారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి శంకరపల్లి మండలంలోని కొత్తపల్లి గ్రామ సమీపంపంలోని వాగులో ఆదివారం సాయంత్రం వాగు ఉధృతితో ప్రవహిస్తోంది. దీంతో అటుగా వచ్చిన ఓ కారు వాగు ఉధృతికి కొట్టుకుపోయింది. ఆ కారులో ఐదుగురు ప్రయాణికులు ఉండగా నలుగురికి ఈత రావటంతో ప్రమాదం నుంచి బయటపడగా ఒకరు మాత్రం గల్లంతు అయ్యారు. గల్లంతైన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకటి పడటంతో ఇంకా గాలిస్తున్నారు. ఈ ప్రమాదంలో బయటపడిన నలుగురు చేవెళ్ల మండలం కౌకుంట్ల గ్రామానికి చెందిన సాయి, రమేష్, ఎ.శ్రీనివాస్, ఎస్.శ్రీనివాస్‌లు కాగా వాగులో కొట్టుకుపోయిన వ్యక్తిది మోమిన్ పెట్ మండలం ఎన్క తల గ్రామనికి చెందిన వెంకయ్యగా స్థానికులు తెలుపుతున్నారు.
మంత్రి సబిత దిగ్భ్రాంతి
భారీ వర్షాల వల్ల చోటు చేసుకున్న సంఘటనల పట్ల విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. వికారాబాద్ జిల్లా కలెక్టర్ , ఎస్పీలతో ఫోన్‌లో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. మర్పల్లి మండలం తిమ్మాపూర్ వాగు వద్ద గల్లంతైన కార్ కోసం జరుగుతున్న గాలింపుపై ఆరా తీశారు. సహాయక చర్యలను వేగవంతం చేయాలని ఆదేశించారు. వాగుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. నవాబు పేట మండలం పుల్ మామిడిలో జరిగిన సంఘటనతోపాటు శంకర్ పల్లి మండలంకొత్తపల్లి వాగు వద్ద చోటు చేసుకున్న సంఘటన పట్ల విచారం వెలిబుచ్చారు.