Thursday, January 23, 2025

అదుపుతప్పి దూసుకెళ్లిన కారు.. ఒకరు మృతి

- Advertisement -
- Advertisement -

నిజామాబాద్ జిల్లా, వేల్పూర్ మండలం, పడగల్ పోచంపల్లి గ్రామ శివారులోని వరద కెనా వద్ద కారు రివర్స్ తీస్తుండగా అదుపు తప్పి కెనాల్‌లో పడింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు ఎస్‌ఐ వినయ్ కుమార్ తెలిపారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకా పడగల్ గ్రామానికి చెందిన గాయిదపల్లి రమేష్ (55) తన వ్యవసాయ పొలం వరద కెనాల్ మత్తడి వాగు వద్దకు తన కారులో నీటి మోటార్‌ను తీసుకెళ్ళాడు. మోటారును మత్తడివాగులో దించి పని ముగించుకుని తిరుగు ప్ర యాణంలో కారు రివర్స్ తీసే క్రమంలో అదుపు తప్పి పక్కనే ఉన్న వరద కెనాల్‌లో పడిపోయింది.

ఈ సంఘటనలో కారు నీటిలో పూర్తిగా మునిగిపోయింది. కారులో ఉన్న రమేష్ కారులోనే మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎస్‌ఐ వినయ్ కుమార్, అగ్నిమాపక సిబ్బంది సంఘట స్థలానికి చేరుకొని చేపలు పట్టే గజాయితాగాలు, అశోక్ ఠాకూర్, కిషన్ సహాయంతో కారులో మృతదేహాన్ని వెలికితీసి ఒడ్డుకు చేర్చారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్‌ఐ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News