Wednesday, January 22, 2025

కార్డియాక్ అమిలోయిడోసిస్

- Advertisement -
- Advertisement -

కార్డియాక్ అమిలోయిడోసిస్ అనేది ఒక అరుదైన, తీవ్రమైన పరిస్థితి. ఇది గుండె సరిగ్గా పనిచేసే సామర్ధాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ స్థితిలో అమిలోయిడ్ నిక్షేపాలు గుండెలో పేరుకుపోతాయి. దీని వలన అది దృఢంగా, చిక్కగా మారుతుంది. ఫలితంగా గుండె ప్రభావవంతంగా రక్తాన్ని పంప్ చేయలేక పోతుంది. ఇది అనేక రకాల లక్షణాలు, సమస్యలకు దారి తీస్తుంది. కార్డియాక్ అమిలోయిడోసిస్ ఇప్పటికీ పూర్తిగా అర్థం కాలేదు. ఈ వ్యాధి చికిత్స మూలకారణం, లక్షణాల తీవ్రతపై ఆధారపడి ఉంటుంది. కొన్ని సందర్భాల్లో, అంతర్లీన పరిస్థితికి చికిత్స చేయడం కార్డియాక్ అమిలోయిడోసిస్‌ను నిర్వహించడానికి సహాయ పడుతుంది.

ఇతర సందర్బాల్లో లక్షణాలను నిర్వహించడానికి, పరిస్థితి పురోగతిని మందగించడానికి మందులు వాడవచ్చు . గుండె సరిగ్గా పనిచేయని పరిస్థితి ఏర్పడితే కార్డియాక్ అమిలోయిడోసిస్ లక్షణంగా భావించి వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి. కార్డియాక్ అమిలోయిడోసిస్ తీవ్రమైన సందర్భాల్లో ఆ వ్యక్తి మనుగడ కనీసం ఆరు నెలల వరకు ఉంటుంది. ఇతరుల్లో ఇది రోగ నిర్ధారణ తరువాత ఎనిమిది నుంచి పది సంవత్సరాల వరకు ఎక్కడైనా ఉంటుంది. ఇది వంశపారంపర్యంగా కూడా రావచ్చు. దీనిని కుటుంబ కార్డియాక్ అమిలోయిడోసిస్ అంటారు. శ్వాసలోపం, అలసట, హృదయ స్పందనలు సరిగ్గా లేక పోవడం, తదితర లక్షణాలు ఈ వ్యాధికి ఉంటాయి. తీవ్రమైతే గుండె వైఫల్యానికి దారి తీస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News