మన తెలంగాణ/హైదరాబాద్: రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన ‘గ్రీన్ ఇండియా చాలెంజ్’లో బాగంగా ”వరల్ హెల్త్ డే‘ పురస్కరించుకుని బంజారాహిల్స్ కేర్ హాస్పిటల్ ప్రాంగణంలో వైద్యులు మొక్కలు నాటారు. ఈ సందర్భంగా డా.మంజుల, డా.పవన్ కుమార్ రెడ్డి, డా.సంగీత మాట్లాడుతూ.. ఎంపి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ గొప్ప కార్యక్రమం అని కొనియాడారు.వరల్ హెల్త్ డే సందర్భంగా మొక్కలు నాటడం ఆనందంగా ఉందని అన్నారు.వృక్షో రక్షతి రక్షితః చెట్లను మనం కాపాడితే అవి తిరిగి మనల్ని కాపాడుతాయని అని అన్నారు.మనకు ఆక్సిజన్ ఎంతో అవసరం ఆక్సిజన్ కావాలంటే ప్రతి ఒక్కరు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. అనంతరం గ్రీన్ ఇండియా చాలెంజ్ లో బాగంగా కేర్ హైటెక్ సిటీ, కేర్ నాంపల్లి, కేర్ ముషీరాబాద్ వైద్య సిబ్బందికి చాలెంజ్ విసిరారు. ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు ఎంపి సంతోష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కేర్ హాస్పిటల్ వైద్యులు డా.రతన్ జా, డా.రాహుల్ అగర్వాల్, డా.అబ్దుల్, డా.వేణుగోపాల్, ఎస్.కె బేహారా, డా.స్నేహ హాస్పిటల్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు.
Care Hospital Doctors plant saplings at Premises