Monday, January 20, 2025

బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్‌తో అవగాహన నిర్వహించిన కేర్ హాస్పిటల్స్

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హైదరాబాద్‌లోని ప్రముఖ మల్టీ-స్పెషాలిటీ హాస్పిటల్స్‌లో ఒకటైన కేర్ హాస్పిటల్స్, హై-టెక్ సిటీ, బ్రెయిన్ ట్యూమర్ తో బాధ పడి విజయవంతంగా చికిత్స పొందిన వ్యక్తులతో అవగాహన వాకథాన్‌ను నిర్వహించింది. వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి డాక్టర్ రజత్ కుమార్, ఐఏఎస్ మరియు డాక్టర్ రూప కొడువాయుర్ లు గౌరవ అతిథి డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి ( ఆప్టిమస్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు & మేనేజింగ్ డైరెక్టర్), డాక్టర్ సమత తుల్లా ( డాక్టర్ & కో-ఫౌండర్ పిఎంఎక్స్ హెల్త్ ) సమక్షంలో జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది మెదడు సంరక్షణ , బ్రెయిన్ ట్యూమర్‌ల ప్రాబల్యం గురించి అవగాహన కల్పించడానికి , బ్రెయిన్ ట్యూమర్లతో ఇబ్బంది పడినప్పటికీ విజయవంతమైన శస్త్రచికిత్స పొందిన వారికి శస్త్ర చికిత్స అనంతరం ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రోత్సహించడానికి పాల్గొన్నారు.

వ్యాధి పరంగా మెదడు కణితులు గణనీయమైన భారాన్ని కలిగిస్తాయి, భారతదేశంలో ప్రతి సంవత్సరం వేలాది కొత్త కేసులు నిర్ధారణ అవుతున్నాయి. భారతదేశంలోని మొత్తం క్యాన్సర్లలో దాదాపు 2% మెదడు కణితులకు సంబంధించినవి. అవి నేటికీ ప్రపంచవ్యాప్తంగా ముఖ్యమైన సమస్యగా ఉన్నాయి. కణితులను ముందుగానే గుర్తించడం మరియు వాటికి అనుగుణంగా చికిత్స చేయడం రోగుల ప్రాణాలను కాపాడటానికి సమర్థవంతమైన మార్గం.

ప్రతికూల పరిస్థితులపై సాధించిన విజయాన్ని వేడుక జరుపుకుంటూ వైద్యులు మరియు ఆసుపత్రి సిబ్బంది బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్ తో కలిసి నడవడంతో కార్యక్రమం ప్రారంభమైంది. బ్రెయిన్ ట్యూమర్ సర్వైవర్స్ తో పాటుగా, వారి కుటుంబీకులను, వైద్య నిపుణులు, సంఘ సభ్యులను ఈ వాక్‌థాన్ ఏకతాటి పైకి తీసుకురావటం తో పాటుగా ముందస్తు రోగ నిర్ధారణ మరియు చికిత్స యొక్క ప్రాముఖ్యతను వెల్లడించింది. ఈ వాకథాన్ లో పాల్గొన్నవారు సరైన వైద్య సంరక్షణతో కోలుకునే సామర్థ్యాన్ని ప్రదర్శిస్తూ, స్థిరత్వం తో కూడిన వ్యక్తిగత కథనాలను పంచుకున్నారు. వాకథాన్ తరువాత, సర్వైవర్స్ యొక్క ధైర్యాన్ని మరియు విజయాన్ని ప్రశంసించడానికి ఒక సన్మాన కార్యక్రమం జరిగింది.

కేర్ హాస్పిటల్స్, హైటెక్ సిటీ – హెచ్ సిఓఓ, సునీత్ అగర్వాల్ మాట్లాడుతూ… “అత్యాధునిక మౌలిక సదుపాయాలు, పరికరాలు, ప్రత్యేక న్యూరో సర్జన్ల బృందంను కేర్ హాస్పిటల్స్, హై-టెక్ సిటీ కలిగి ఉంది. సంక్లిష్టమైన మెదడు కణితి కేసులను నిర్వహించడానికి మేము పూర్తిగా సిద్దమై వున్నాము. మా నిష్ణాతులైన వైద్యులు, సహాయక సిబ్బంది మా రోగులకు సమగ్ర సంరక్షణను అందించడానికి సిద్ధంగా ఉన్నారు” అని అన్నారు.

బ్రెయిన్ ట్యూమర్‌లను ఎదుర్కోవడంలో అవగాహన యొక్క ఆవశ్యకతను డాక్టర్ రూప నొక్కిచెప్పారు. ఆమె మాట్లాడుతూ “మెదడు కణితులతో పోరాడడంలో అవగాహన అనేది మొదటి అడుగు. ప్రారంభ దశలోనే రోగ నిర్ధారణ చేయటం, సరైన చికిత్స, రోగి చికిత్స ఫలితాలను గణనీయంగా మెరుగుపరుస్తాయ. చాలా మంది వ్యక్తులు, ఒకసారి ముందుగానే రోగనిర్ధారణ చేయబడి, తగిన చికిత్స అందుకున్న ఎడల, వారు వేగంగా కోలుకోవచ్చు. సంతృప్తికరమైన జీవితాలను గడపవచ్చు. ఈ రోజు, మేము మా సర్వైవర్స్ కు నివాళులు అర్పిస్తున్నాము, వారి మనో బలం, సంకల్పం ఆశ, స్థిరత్వం కు నిదర్శనం. వారి జీవిత ప్రయాణాలు ముందస్తు జోక్యం, సరైన వైద్య సంరక్షణ యొక్క ప్రాముఖ్యతను వెల్లడిస్తాయి, అవగాహన మెరుగుపరచడం, ఈ సవాలుతో బాధపడుతున్న వారికి మద్దతు ఇవ్వడం కొనసాగించడానికి మనందరికీ స్ఫూర్తినిస్తాయి” అని అన్నారు.

వరల్డ్ బ్రెయిన్ ట్యూమర్ డే కార్యక్రమాలలో భాగంగా, కేర్ హాస్పిటల్స్, హై-టెక్ సిటీ, బ్రెయిన్ ఇమేజింగ్ (సిటి స్కాన్) మరియు న్యూరో సర్జన్ కన్సల్టేషన్‌లపై ఒక నెల పాటు ప్రత్యేక 50% తగ్గింపును కూడా అందిస్తోంది. దీని ద్వారా, మెదడు కణితుల సంకేతాలు మరియు లక్షణాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం, సకాలంలో వైద్య సహాయం పొందటం ద్వారా ప్రాణాలను కాపాడవచ్చని నొక్కి చెప్పడం ఆసుపత్రి లక్ష్యం. రోగుల సంరక్షణ మరియు కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ పట్ల ఆసుపత్రి యొక్క నిబద్ధత ఈ హృదయపూర్వక కార్యక్రమం లో స్పష్టంగా కనిపించింది, సర్వైవర్స్ మనో బలాన్ని మరియు సంకల్పాన్ని వేడుక చేసుకుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News