దస్తురాబాద్ : మన ఊరు మన బడి అభివృద్ధి పనులను పూర్థి చేయాలని ్ల కలెక్టర్ వరుణ్ రెడ్డి పేర్కొన్నారు. మండలకేంద్రంతో పాటు మున్యాల్,గొడిసెర్యాల, గొండుగూడెం గ్రామాల్లో గురువారం ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన ఆకస్మీకంగా పర్యటించారు. మండలకేంద్రంలోని పల్లె ప్రకృతి వనాన్ని, జడ్పీ ఉన్నత పాఠశాలలో కొనసాగుతున్న మన ఊరు మన బడి పనులను ఆయన పరిశీలించి వివరాలను సేకరించారు. మన ఊరు మన బడి పనులను చూసి అభినందించారు. అనంతరం జడ్పీ ఉన్నత పాఠశాలలోని 6వ తరగతి, 10 వ తరగతులను పరిశీలించారు.
విద్యార్థులతో కాసేపు మాట్లాడారు. 10వ తరగతి విద్యార్థులకు స్వయంగా తానే ఉపాధ్యాయుడిగా బోదించారు. పదవ తరగతి విద్యార్థులు 10/10 జీపీఎ సాధించాలని సూచించారు. జడ్పీ ఉన్నత పాఠశాల, కేజీబీవీ పాఠశాలలో ప్రహరీ నిర్మాణ పనులను ప్రారంభించాలని అధికారులకు సూచించారు. మున్యాల్ గ్రామంలో ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో కొనసాగుతున్న మన ఊరు మన బడి పనులను పరిశీలించారు.
అదే గ్రామంలో జడ్పీ ఉన్నత పాఠశాలలో సమస్యలను హెచ్‌ఎం కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. రాంపూర్,మున్యాల ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు కొరత ఉందని కలెక్టర్ దృష్టికి సర్పంచ్‌లు, గ్రామస్తులు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వర్షకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అప్రమత్తంగా ఉండి, తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సంతపూరి శారద శ్రీనివాస్, ఆయా గ్రామాల సర్పంచ్‌లు నిమ్మతోట రాజమణి శివయ్య, దుర్గం శంకర్, తహసీల్థార్ లక్ష్మీ, ఎంపిడిఓ విజయ్ భాస్కర్‌రెడ్డి, ఎంపిఓ అనిల్ కుమార్,ఆర్‌ఐలు గంగన్న, పీవి నర్సయ్య, ఎపిఎం గంగాధర్,ఎపిఓ రవి ప్రసాద్,కాంప్లెక్స్ హెచ్‌ఎం ఈశ్వర్, ఎస్‌వో తిరుపతి, ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, సీఆర్‌పి తిరుపతి, ఉపాధ్యాయులు, టిఎ, పంచాయతీ కార్యదర్శులు తదితరులు ఉన్నారు.