Wednesday, January 22, 2025

సెల్లార్ గుంతల వద్ద జాగ్రత్తలు పాటించాలి

- Advertisement -
- Advertisement -

మాదాపూర్: వర్షాకాలంను దృష్టిలో పేట్టుకొని సెల్లార్ గుంతలను తీయవద్దని బిల్డర్‌లను ప్రభుత్వ విప్, శేరిలింగంపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ఆదేశించారు. శనివారం హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని మదీనగూడాలోని అవంతిక ఎన్‌క్లేవ్‌లో సెల్లార్ వల్ల నెలకొన్న సమస్యను కాలనీ వాసులు ఎమ్మెల్యే గాంధీ దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. అందుకు ఆయన కాలనీలో పర్యాటంచారు. సెల్లార్‌లో వర్షపు నీటిలో నిండటంతో తక్షణమే రక్షణ చర్యలు చేపట్టాలన్నారు. బారికేడ్లు, ఇసుక బస్తాలు వేసి త్వరితగతిన పనులు పూర్తి చేయాలన్నారు.

ప్రజలకు కాలనీ వాసులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని బిల్డర్‌కి ఆదేశించారు. వర్షాకాలంను దృష్టిలో పెట్టుకొని అన్ని రక్షణ చర్యలు, బారి కేడ్లు చేపట్టాలన్నారు. కాలనీ వాసులు దైర్యంగా ఉండాలన్నారు. మీకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. చిన్న పిల్లలు, పెద్దలు, కాలనీ వాసులు అటు వైపు వెళ్లకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, కాలనీ వాసులు తదితరులు పాల్గోన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News