- మెదక్ జిల్లా వ్యవసాయాధికారిణి ఆశాకుమారి
మెదక్: మెదక్ జిల్లా వ్యాప్తంగా గత నాలుగైదు రోజులుగా భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో అన్నదాతలు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఈ విషయంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఆయామండలాల్లోని మండల వ్యవసాయాధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారుల సహకారం తీసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారిణి ఆశాకుమారి అన్నారు. శనివారం ఆమె తన కార్యాలయంలో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు కురుస్తున్నందున ముఖ్యంగా వర్షాదార పంటలైన పత్తి, కంది, మొక్కజొన్న, జొన్న, వరిపంటలనుసాగు చేస్తున్నరైతులు తమపంట పొలాల్లో నీరు అధికంగా నిల్వ ఉన్న పరిస్థితులు ఉంటే వెంటనేనీటిని బయటకు పంపించేవిధంగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని కోరారు.అలాగే నీరు అధికంగా నిల్వ ఉన్నఅధికంగా తేమ ఉన్నపంటలో ఎరువులను వేయకుండా ఉండాలని జిల్లా అధికారిణి రైతులకు సూచించారు. ప్రస్తుత సమయంలో పంటలకు ఎరువులు అందవని, ఎరువుల వేడికి చిన్న మొక్కలుచనిపోయే ప్రమాదం ఉంటుందన్నారు. అలాగే వరి, కూరగాయల నారుమడుల్లో సైతం నీరు నిల్వ ఉండకుండా అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని రైతులకు తెలిపారు.