Thursday, January 23, 2025

నౌకలో భారీ అగ్నిప్రమాదం

- Advertisement -
- Advertisement -

ది హేగ్ : నెదర్లాండ్స్‌కు చెందిన ఓ సరకు రవాణా నౌకలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. దాదాపు 3 వేల కార్లతో నార్త్ సీ ( అట్లాంటిక్ సముద్రంలో భాగం ) వెళ్తున్న ఈ నౌకలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రానురాను ప్రమాదం తీవ్రం కావడంతో భయంతో సిబ్బంది తప్పించుకోడానికి ప్రయత్నించారు. కొందరు సమద్రంలో దూకారు. ఈ ప్రమాదంలో సిబ్బందిలో ఒకరు ప్రాణాలు కోల్పోయినట్టు మరి కొందరు గాయపడినట్టు డచ్ కోస్ట్‌గార్డ్ చెప్పారు. నౌక మునిగిపోకుండా ఉండేందుకు , నౌక నుంచి సిబ్బంది 23 మందిని రక్షించడానికి బోట్లు, హెలికాప్టర్లను వినియోగించి ప్రయత్నిస్తున్నా మంటలు ఆరడం లేదని కోస్ట్‌గార్డు ప్రకటనలో పేర్కొంది. నౌక నుంచి సముద్రం లోకి దూకిన కొంతమంది సిబ్బంది లైఫ్‌బోట్‌ను అందుకోగలిగారని లైఫ్‌బోట్ కెప్టెన్ చెప్పారు. కొంతమంది సిబ్బందికి ఎముకలు విరిగాయి.

మరికొందరికి కాలిన గాయాలయ్యాయి. కొందరికి శ్వాస సమస్యలు ఏర్పడ్డాయి. వీరందరినీ ఉత్తర నెదర్లాండ్ లోని ఆస్పత్రులకు తరలించారు. జర్మనీ లోని బ్రెమెన్ పోర్టు నుంచి ఈజిప్టు లోని మరో పోర్టుకు ఫ్రెమాంటిల్ హైవే నౌక 2857 కార్లతో బయలుదేరింది. అందులో కొన్ని ఎలక్ట్రిక్ వాహనాలు కూడా ఉన్నాయి. సముద్రంలో ప్రయాణిస్తున్న నౌక అమేలాండ్ ద్వీపానికి 27 కిమీ సమీపంలో ఉండగా, అందులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. మంటలు అదుపు లోకి వచ్చే అవకాశం కనిపించక పోవడంతో అందులో ఉన్న మొత్తం 23 మంది సిబ్బందిని రెస్యూ సిబ్బంది బయటకు తీసుకు వచ్చారు. అయితే అందులో ఒకరు అప్పటికే ప్రాణాలు కోల్పోయాడు. భారీ నౌక మునిగిపోకుండా ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. నౌక లోని కార్లన్నీ దగ్ధం అయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News