Thursday, December 19, 2024

కార్గో నౌక మునిగి 13 మంది గల్లంతు

- Advertisement -
- Advertisement -

ఏథెన్స్ : గ్రీస్ దేశ తీరం లెస్బాస్ ద్వీపానికి సమీపాన ఆదివారం ఉదయం రాప్టర్ అనే కార్గో నౌక మునిగిపోవడంతో 13 మంది గల్లంతయ్యారు. ఈ నౌకలో మొత్తం 14 మంది సిబ్బంది ఉండగా, వీరిలో ఎనిమిది మంది ఈజిప్టుకు చెందిన వారు, నలుగురు భారతీయులు, ఇద్దరు సిరియాకు చెందిన వారు ఉన్నారు. గాలులు బలంగా వీచి సముద్రం అల్లకల్లోలంగా మారడంతోనే ఈ ప్రమాదం జరిగింది. ఈజిప్టు లోని అలెగ్జాండ్రియా నుంచి తుర్కియే లోని ఇస్తాంబుల్ కు బయలుదేరిన ఈ నౌకలో 6 వేల టన్నుల ఉప్పు ఉంది.

ఆదివారం ఉదయం 7 గంటల ప్రాంతంలో నౌకలో సాంకేతిక సమస్య తలెత్తడంతో సిబ్బంది వెంటనే లెస్బాస్‌కు వాయువ్య దిశలో సమీపాన గల కేంద్రానికి ప్రమాద సంకేతాన్ని పంపారు. ఆ తరువాత 8 కిమీ దూరంలో నౌక కనిపించకుండా పోయింది. ఎనిమిది మర్చంట్ నౌకలు, రెండు హెలికాప్టర్లు, గ్రీక్ నేవీ యుద్ధ నౌక రంగం లోకి దిగి గాలింపు చేపట్టాయి. గల్లంతైన వారిలో ఈజిప్టు దేశస్థుడు ఒకరిని రక్షించారు. మిగతా 13 మంది ఆచూకీ ఇంకా లభ్యం కాలేదు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News