Monday, December 23, 2024

అల్కరాజ్ శుభారంభం

- Advertisement -
- Advertisement -

సక్కారి, ఒసాకా ముందంజ
వింబుల్డన్ ఓపెన్
లండన్: ప్రతిష్ఠాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్) శుభారంభం చేశాడు. మహిళల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్ మారియా సక్కారి (గ్రీస్), 12వ సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా), ఏడో సీడ్ జస్మయిన్ పౌలిని (ఇటలీ) రెండో రౌండ్‌కు చేరుకున్నారు.మరోవైపు మాజీ నంబర్ వన్ నవోవి ఒసాకా (జపాన్) కూడా తొలి రౌండ్‌లో విజయం సాధించింది. కానీ 8వ సీడ్ కిన్‌వెన్ జెంగ్ (చైనా) మొదటి రౌండ్‌లోనే ఇంటిదారి పట్టింది.

న్యూజిలాండ్‌కు చెందిన లు రాడోసిక్‌తో జరిగిన పోరులో జెంగ్ 46, 62, 64తో పరాజయం చవిచూసింది. అన్ సీడెడ్ ఒసాకా 61, 16, 64తో డియానె పారె (ఫ్రాన్స్)పై విజయం సాధించింది. జస్మయిన్ 76, 63 తేడాతో సారా సొరిబస్ (స్పెయిన్)ను ఓడించి ముందంజ వేసింది. మాడిసన్ కీస్ తొలి రౌండ్‌లో ఇటలీకి చెందిన ట్రెవిసన్‌పై 64, 76తో జయభేరి మోగించింది. 14వ సీడ్ కసట్కినా (రష్యా) మొదటి రౌండ్‌లో చైనాకు చెందిన జాంగ్‌ను ఓడించింది. ఏక పక్షంగా సాగిన పోరులో కసట్కినా 63, 60తో జయకేతనం ఎగు వేసింది. మరో పోటీలో మారియా సక్కారి అలవోక విజయం సాధించి రెండో రౌండ్‌కు దూసుకెళ్లింది. అమెరికాకు చెందిన కెస్సెలర్‌తో జరిగిన తొలి రౌండ్‌లో సక్కారి 63, 61తో విజయం సాధించింది. ఇతర పోటీల్లో 18వ సీడ్ మార్టా కొస్టివుక్ (ఉక్రెయిన్), ఎలిసె మెర్టెన్స్ (బెల్జియం), 28వ సీడ్ డయానా (ఉక్రెయిన్) తదితరులు విజ యం సాధించి రెండో రౌండ్‌కు చేరుకున్నారు.

కార్లొస్ బోణీ

మరోవైపు పురుషుల సింగిల్స్‌లో మూడో సీడ్ అల్కరాజ్ తొలి రౌండ్‌లో విజయం సాధించాడు.ఇస్టోనియా ఆటగాడు మార్క్ లజల్‌తో జరిగిన పోరులో అల్కరాజ్ 76, 75, 62తో జయకేతనం ఎగుర వేశాడు. ఆరంభం నుంచే పోరు ఆసక్తికరంగా సాగింది. అయితే చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న అల్కరాజ్ వరుసగా మూడు సెట్లు గెలిచి ముందంజ వేశాడు. మరో పోటీలో ఐదో సీడ్ మెద్వెదేవ్ 63, 64,64తో కొవసెవిక్ (అమెరికా)పై విజయం సాధించాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News