Sunday, December 22, 2024

సెమీస్‌లో అల్కరాజ్, కీస్

- Advertisement -
- Advertisement -

న్యూయార్క్: ప్రతిష్ఠాత్మకమైన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో టాప్ సీడ్ కార్లొస్ అల్కరాజ్ (స్పెయిన్) సెమీ ఫైనల్‌కు దూసుకెళ్లాడు. మహిళల సింగిల్స్‌లో రెండో సీడ్ అరినా సబలెంక (బెలారస్), 17వ సీడ్ మాడిసన్ కీస్ అమెరికా క్వార్టర్ ఫైనల్ పోరులో విజయం సాధించారు. రష్యాకు చెందిన రెండో సీడ్ డానిల్ మెద్వెదేవ్ కూడా సెమీ ఫైనల్‌కు చేరుకున్నాడు. తన దేశానికే చెందిన తొమ్మిదో సీడ్ ఆండ్రి రుబ్లేవ్‌తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో మె ద్వెదేవ్ అలవోక విజయాన్ని అందుకున్నా డు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన మె ద్వెదేవ్ 64, 63, 6తో రుబ్లేవ్‌ను కంగుతినిపించాడు. డానిల్ తన మార్క్ ఆటతో సహచర ఆటగాడిని ముప్పుతిప్పలు పెట్టా డు. చక్కని షాట్లతో అలరించిన డానిల్ వరుసగా మూడు సెట్లు గెలిచి మ్యాచ్‌ను సొం తం చేసుకున్నాడు.
అలవోకగా..
మరో క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ అల్కరాజ్ సునాయాస విజయం సాధించాడు. జర్మనీ కి చెందిన 12వ సీడ్ అలెగ్జాండర్ జ్వరేవ్‌తో జరిగిన పోరులో అల్కరాజ్ 63, 62, 64తో జయకేతనం ఎగుర వేశాడు. ప్రా రంభం నుంచే స్పెయిన్ సంచలనం పైచేయి సాధించాడు. ఏ దశలోనూ జ్వరేవ్‌కు కోలుకునే ఛాన్స్ ఇవ్వలేదు. కళ్లు చెదిరే షాట్లతో విరుచుకు పడిన అల్కరాజ్ ఎలాంటి ప్రతిఘటన లేకుండానే తొలి రెండు సెట్లను గెలుచుకున్నాడు. ఇక మూడో సెట్‌లో జ్వరేవ్ కాస్త మెరుగైన ప్రదర్శన ఇచ్చాడు. అద్భుత పోరా ట పటిమతో అల్కరాజ్‌కు గట్టి పోటీ ఇచ్చా డు. అయితే కీలక సమయంలో మళ్లీ ఒత్తిడి కి గురయ్యాడు. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న అల్కరాజ్ సెట్‌తో పాటు మ్యా చ్‌ను గెలిచి ముందంజ వేశాడు. సెమీస్‌లో రష్యా ఆటగాడు మెద్వెదేవ్‌తో అల్కరాజ్ త లపడుతాడు. మరో సెమీస్‌లో రెండో సీడ్ నొవాక్ జకోవిచ్ అమెరికా యువ సంచల నం బెన్ షెల్టన్‌ను ఎదుర్కొంటాడు. శనివా రం సెమీస్ పోటీలు జరుగుతాయి.
వొండ్రూసోవా ఔట్..
మరోవైపు మహిళల సింగిల్స్‌లో తొమ్మిదో సీడ్ మర్కెటా వొండ్రూసోవా పోరాటం క్వార్టర్ ఫైనల్లోనే ముగిసింది. అమెరికా క్రీడాకారిణి మాడిసన్ కీస్ 61, 64తో వొండ్రూసోవాను ఓడించింది. తొలి సెట్‌లో కీస్‌కు ఎలాంటి పోటీ ఎదురు కాలేదు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన కీస్ అలవోకగా సెట్‌ను దక్కించుకుంది. అయితే రెండో సెట్‌లో వొండ్రూసోవా కాస్త పుంజుకుంది. చక్కని షాట్లతో మళ్లీ పైచేయి సాధించేందుకు ప్రయత్నించింది. కానీ కీలక దశలో ఒత్తిడిని తట్టుకోలేక వరుస తప్పిదాలకు పాల్పడింది. దీన్ని తనకు అనుకూలంగా మార్చుకున్న కీస్ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి సెమీస్‌కు చేరుకుంది. మరో క్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ సబలెంక విజయం సాధించింది. చైనాకు చెందిన జెంగ్‌తో జరిగిన పోరులో సబలెంక 61, 64తో జయకేతనం ఎగుర వేసింది. శుక్రవారం జరిగే సెమీస్ పోటీల్లో ఆరో సీడ్ గాఫ్‌తో 10వ సీడ్ ముచోవా, కీస్‌తో సబలెంక తలపడుతారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News