Monday, December 23, 2024

కల చెదిరిన జకోవిచ్..

- Advertisement -
- Advertisement -

లండన్: వరుస టైటిల్స్‌తో ప్రపంచ టెన్నిస్‌లో రారాజుగా వెలుగొందుతున్న సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్ జైత్రయాత్రకు స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ బ్రేక్ వేశాడు. వరుసగా ఐదో వింబుల్డన్ టైటిల్‌ను సాధించి చరిత్ర సృష్టించాలని భావించిన జకోవిచ్‌కు అల్కరాజ్ షాక్ ఇచ్చాడు. నాలుగేళ్లుగా వింబుల్డన్‌లో వరుసగా టైటిల్స్ సాధిస్తూ వస్తున్న జకోవిచ్ ఈసారి కూడా ఫైనల్‌కు చేరాడు. అతని జోరును చూస్తే ఈసారి కూడా టైటిల్ సాధించడం ఖాయమని అందరూ భావించారు.

ఊహించినట్టే తొలి సెట్‌ను జకోవిచ్ అలవోకగా గెలుచుకున్నాడు. దీంతో అతని విజయం లాంఛనమేనని కనిపించింది. కానీ స్పెయిన్ నయా సంచలనం అల్కరాజ్ మాత్రం ఒత్తిడిని సయితం తట్టుకుంటూ ముందుకు సాగాడు. జకోవిచ్ జోరుకు బ్రేక్ వేస్తూ తన ఖాతాలో వింబుల్డన్‌ట్రోఫీని జత చేసుకున్నాడు. ఇక ఈ ఓటమి జకోవిచ్‌ను తీవ్ర నిరాశకు గురి చేసింది. రానున్న రోజుల్లో అతనికి అల్కరాజ్ నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశాలు స్పష్టం కనిపిస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News