లండన్ : ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్ పురుషుల సింగిల్స్‌లో కార్లోస్ అల్కరాజ్ సంచలన విజయం సాధించి, తొలి వింబుల్డన్ టైటిల్ కైవసం చేసుకున్నాడు. సెంట్రల్ కోర్టు వేదికగా ఆదివారం జరిగిన టైటిల్ పోరులో టాప్ సీడెడ్ ఆటగాళ్లు కార్లోస్ అల్కరాజ్(మొదటి ర్యాంకు), నోవాక్ జొకోవిక్(రెండో ర్యాంకు) నువ్వా నేనా అన్నట్లుగా పోరాడారు. నాలుగున్నర గంటలపాటుగా కొన సాగిన ఈ పోరులో స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాజ్ 16 76 61 36 64తో సెర్బియా స్టార్ నోవాక్‌ను మట్టికరిపించాడు.
తొలిసెట్‌ను అలవోకగా కోల్పోయిన అల్కరాజ్ రెండో సెట్ ప్రతిఘటించి 76తో సొంతం చేసుకున్నాడు. అనంతరం మూడో సెట్‌ను అలవోకగా కైవసం చేసుకున్నా నాలుగో సెట్‌లో 36తో ఓడిపోయాడు. అనంతరం జరిగిన నిర్ణయాత్మక సెట్‌లో చెమట్టోడ్చి 64తో సెట్ కైవ సం చేసుకొని గేమ్ ముగించాడు. కాగా, అల్కరాజ్‌కిది వింబుల్డన్ తొలి టైటిల్. ఓవరాల్‌గా అతనికిది రెండో గ్రాండ్‌స్లామ్ టైటిల్. గతేడాది ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గిన విషయం విదితమే.