Saturday, November 23, 2024

టెన్నిస్ నయా సంచలనం అల్కరాజ్

- Advertisement -
- Advertisement -

మన తెలంగాణ/క్రీడా విభాగం : ప్రపంచ పురుషుల టెన్నిస్‌కు కొత్త స్టార్ దొరికాడు. స్పెయిన్ యువ సంచలనం కార్లోస్ అల్కరాజ్ ప్రతిష్టాత్మకమైన వింబుల్డన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించి పెను ప్రకంపనలు సృష్టించా డు. నువ్వానేనా అన్నట్టు సాగిన మారథాన్ ఫైనల్ సమరం లో వింబుల్డన్ కింగ్, సెర్బియా యోధుడు నొవాక్ జకోవిచ్‌ను ఓడించి కొత్త ఛాంపియన్‌గా అవతరించాడు. ఈ క్రమంలో ఎన్నో రికార్డులను యువ సంచలనం అల్కరాజ్ తిరగరాశాడు. 2018 నుంచి వింబుల్డన్‌లో జకోవిచ్ ఏకచక్రాధిపత్యాన్ని చెలాయిస్తున్నాడు. అప్పటి నుంచి వింబుల్డన్‌లో జకోవిచ్ వరుస టైటిల్స్‌తో అదరగొడుతున్నాడు. పదేళ్ల కాలంలో సెంట్రల్ కోర్టులో అయితే వరుసగా 45 మ్యాచ్‌లు గెలిచాడు. ఇలాంటి స్థితిలో వింబుల్డన్ ఓపెన్‌లో జకోవిచ్‌ను ఓడించే వాడే కనిపించకుండా పోయాడు.

చిరకాల ప్రత్యర్థుల్లో రోజర్ ఫెదరర్ ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించగా స్పెయిన్ బుల్ రఫెల్ నాదల్ గాయాలతో సతమతమవుతున్నాడు. బ్రిటన్ స్టార్ ఆండ్రీ ముర్రే కూడా పేలవమైన ఆటతో జకోవిచ్‌కు కనీస పోటీ ఇచ్చే స్థితిలో కూడా లేకుండా పోయాడు. ఈ పరిస్థుతుల్లో జకోవిచ్ మరి కొన్నే ళ్ల పాటు వింబుల్డన్‌లో ఆధిపత్యం చెలాయించడం ఖాయమని విశ్లేషకులు సయితం అభిప్రాయపడ్డారు. కానీ ఈ అంచనాలను స్పెయిన్ యువ కెరటం అల్కరాజ్ తారుమా రు చేశాడు. వింబుల్డన్ ఫైనల్‌లో జకోవిచ్‌ను ఓడించి టైటిల్‌నె ఎగురేసుకు పోయాడు. రానున్న రోజుల్లో తనదే రాజ్యమని చాటి చెప్పాడు. 20 ఏళ్ల చిన్న వయసులో అల్కరాజ్ వింబుల్డన్ టైటిల్‌ను ముద్దాడి చరిత్ర సృష్టించాడు. ఇప్పటికే యూఎస్ ఓపెన్ టైటిల్‌ను అల్కరాజ్ సాధించాడు.
తండ్రి ప్రోత్సాహంతో..
కార్లోస్‌లోని ప్రతిభను అతని తండ్రి గొంజాలెజ్ చిన్నప్పుడే గుర్తించాడు. నాలుగేళ్ల వయసులోనే అల్కరాజ్‌తో రాకెట్ పట్టించాడు. తాను డైరెక్టర్‌గా ఉన్న టెన్నిస్ క్లబ్‌లోనే అల్కరాజ్‌కు టెన్నిస్ ఓనమాలు నేర్పించాడు. ఆ తర్వాత అల్కరాజ్ వెనుదిరిగి చూడలేదు. 2018లో జువాన్ కార్లోస్ ఫెరీరో అకాడమీలో చేరడంతో అల్కరాజ్ మరింత రాటుదేలి పోయాడు. 16 ఏళ్లకే ఎటిపి టోర్నీలో అడుగు పెట్టాడు. 17 ఏళ్ల వయసులో గ్రాండ్‌స్లామ్ టోర్నమెంట్‌లో ఆరంగేట్రం చేశాడు. స్వల్ప వ్యవధిలోనే అల్కరాజ్ ప్రపంచ టెన్నిస్‌పై తనదైన ముద్ర వేశాడు.

వింబుల్డన్‌కు ముందు యుఎస్ ఓపెన్‌తో సహా 11 ఎటిపి టూర్ టైటిల్స్‌ను సాధించి చరిత్ర సృష్టించాడు. ఇందులో నాలుగు మాస్టర్స్ 1000 టైటిల్స్ కూడా ఉండడం విశేషం. ఇదే క్రమంలో ప్రతిష్టాత్మకమైన మాడ్రిడ్ ఓపెన్ టైటిల్‌ను కూడా తన వేసుకున్నాడు. టైటిల్ సాధించే క్రమంలో నాదల్, జకోవిచ్, జ్వరేవ్ వంటి స్టార్లను చిత్తు చేశాడు. అంతేగాక అతి చిన్న వయసులో ఎటిపి ర్యాంకింగ్స్‌లో టాప్ ర్యాంక్‌ను దక్కించుకుని సత్తా చాటాడు. టీనేజర్‌గా ఉన్న సమయంలోనే ఇన్ని రికార్డులను సాధించిన అల్కరాజ్ రానున్న రోజుల్లో పురుషుల టెన్నిస్‌లో ఏకచక్రాధిపత్యం చెలాయించడం ఖాయమని విశ్లేషకులు జోస్యం చెబుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News