Thursday, January 23, 2025

కార్లొస్‌కు టైటిల్

- Advertisement -
- Advertisement -

Carlos Alcaraz won Miami Open Tennis Title

మియామి: ప్రతిష్టాత్మకమైన మియామి ఓపెన్ టెన్నిస్ టోర్నమెంట్‌లో స్పెయిన్ సంచలనం, 14వ సీడ్ కార్లొస్ అల్కరాజ్ గర్ఫియా టైటిల్‌ను సాధించాడు. ఆసక్తికరంగా సాగిన ఫైనల్లో కార్లొస్ 75, 64 తేడాతో నార్వేకు చెందిన 8వ సీడ్ కాస్పర్ రూడ్‌ను ఓడించాడు. ఈ క్రమంలో ఇద్దరు ఆరంభం నుంచే హోరాహోరీగా తలపడ్డారు. ఆరంభ సెట్‌లో ఒక దశలో రూడ్ ఆధిపత్యం చెలాయించాడు. కానీ కీలక సమయంలో కార్లొస్ పుంజుకున్నాడు. పట్టువీడకుండా పోరాడుతూ లక్షం దిశగా సాగాడు. ఈ క్రమంలో టైబ్రేకర్‌లో సెట్‌ను సొంతం చేసుకున్నాడు. రెండో సెట్‌లో కూడా పోరు హోరాహోరీగానే సాగింది. కానీ ఈసారి కార్లొస్ మరింత నిలకడైన ఆటను కనబరిచాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకుంటూ సెట్‌తో పాటు మ్యాచ్‌ను గెలిచి టైటిల్‌ను దక్కించుకున్నాడు. ఇక ఈ విజయంతో కార్లొస్ అరుదైన రికార్డును సాధించాడు.

Carlos Alcaraz won Miami Open Tennis Title

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News