Sunday, April 6, 2025

ఛాంపియన్ కార్ల్‌సన్

- Advertisement -
- Advertisement -

తొలిసారి ప్రపంచకప్‌ను గెలిచిన స్టార్ ఆటగాడు
ప్రజ్ఞానందకు రన్నరప్

బాకు/అజర్‌బైజాన్ : భారత యువ చెస్ స్టార్ ప్రజ్ఞానంద తుదిరులో ఓటమిపాలయ్యాడు. ఐదు సార్లు వరల్డ్ చెస్ ఛాంపియన్ నలిచి, అగ్రస్థానంలో కొనసాగుతున్న మాగ్నస్ కార్ల్‌సన్ చేతిలో ఓడిపోయాడు. ఫిడె చెస్ వరల్డ్ కప్ 2023లో భాగంగా గురువారం జరిగిన ఫైనల్ టై బ్రేక్‌లో మొదటి గేమ్‌ను నెగ్గిన కార్ల్‌సన్. రెండో గేమ్‌ను డ్రా చేసుకున్నాడు. దీంతో తొలిసారి చెస్ వరల్డ్ కప్‌లో ఛాంపియన్‌గా అవతరించాడు. ఇప్పటికే అనేక టైటిళ్లను సొంతం చేసుకున్న కార్ల్‌సన్ కు.. ఇదే మొదటి వరల్డ్ కప్ కావడం విశేషం. కాగా, ఛాంపియన్‌గా నిలిచిన కార్ల్‌సన్‌కు రూ. 91 లక్షలు, రన్నరప్ ప్రజ్ఞానందకు రూ. 66 లక్షల నగదు బహుమతిని అందుకున్నాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News