Wednesday, January 22, 2025

1980 నేపథ్యంలో చిత్రం

- Advertisement -
- Advertisement -

తెలుగు చిత్రసీమలో విశిష్టమైన నందమూరి వారసత్వాన్ని మరింత ముందుకు తీసుకువెళుతూ, లెజెండరీ ఎన్టీఆర్ ముని మనవడు, హరికృష్ణ మనవడు, దివంగత జానకిరామ్ తనయుడు యంగ్ చాప్ నందమూరి తారక రామారావు ఫిలిమ్స్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ చిత్రంలో తెలుగమ్మాయి వీణ రావ్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి రచన, దర్శకత్వం వహిస్తున్న ఈ ప్రాజెక్ట్‌ని ‘న్యూ టాలెంట్ రోర్స్ @’ బ్యానర్‌పై యలమంచిలి గీత నిర్మిస్తున్నారు. కింగ్ అక్కినేని నాగార్జున బర్త్‌డేను సెలబ్రేట్ చేసుకుంటూ, తెలుగు భాషా దినోత్సవాన్ని పురస్కరించుకొని మేకర్స్ ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన ముఖ్యమైన అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా 1980 నేపథ్యంలో వుంటుందని మేకర్స్ ప్రకటించారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో డైనమిక్ డైరెక్టర్ వైవిఎస్ చౌదరి మాట్లాడుతూ “1980 నేపథ్యంలో ఈ సినిమా కథ జరగబోతోంది. ఈ నేపథ్యం బలీయమైన తెలుగు భాష, సంస్కృతి, తెలుగు జాతి నేపథ్యం ఇది. తెలుగు భాషా, సంస్కృతి, విలువలు గురించి చెప్పాలని ఎప్పటినుంచో భావిస్తున్నాను. సందేశంలా కాకుండా మంచి వాణిజ్య విలువలు వున్న అంశాలు వున్నప్పడే ఇలాంటి కథ చెయ్యాలి. అలాంటి వాణిజ్య విలువలు అన్నీ కుదిరిన కథ ఇది”అని అన్నారు. లిరిక్ రైటర్ చంద్రబోస్ మాట్లాడుతూ “ఈ సినిమాలో మరింత అందమైన అర్ధవంతమైన పాటలు రాసే అవకాశం నాకు రాబోతోంది. ఆ అవకాశం కల్పించిన మా దర్శకులు చౌదరికి, సంగీత దర్శకులు కీరవాణికి ధన్యవాదాలు”అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డైలాగ్ రైటర్ సాయి మాధవ్ బుర్రా, నిర్మాత గీతా యలమంచిలి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ రమేష్ అత్తిలి పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News