- Advertisement -
ఓ ఇంటిమీద దాడి చేసేందుకు వెళ్ళిన ఇన్ కమ్ టాక్స్ అధికారులకు.. ఇంటిముందు కొలువు తీరిన ఖరీదైన రోల్స్ రాయిస్, ఫాంటమ్, మెక్ లారెన్, లంబోర్ఘని, ఫెర్రారీ వంటి కార్లు చూసి మతిపోయింది! ఆ కార్ల ఖరీదు సుమారు 60 కోట్లవరకూ ఉంటుందట. కార్లే ఇన్ని ఉంటే, ఇంట్లో ఎంత డబ్బుందోనని అధికారులు ఇంటిమీద దాడి చేశారు. సోదాల్లో నాలుగున్నర కోట్ల రూపాయల నగదుతోపాటు కోట్ల విలువ చేసే ఆస్తుల తాలుకు పత్రాలు దొరికాయట.
ఢిల్లీలోని బంశీధర్ టుబాకో కంపెనీ యజమాని కుమారుడు శివమ్ మిశ్రా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు సమాచారం అందడంతో ఆదాయపన్ను శాఖ అధికారులు రంగంలోకి దిగారు. ఢిల్లీలోని అతని ఇంటితోపాటు కాన్పూర్, ముంబయి తదితర 20 ప్రాంతాలలో ఉన్న ఆస్తులపై ఏకకాలంలో దాడులు జరిపారు. కార్లతోపాటు సోదాల్లో బయటపడిన నగదును, డాక్యుమెంట్లను సీజ్ చేసి, కేసు నమోదు చేశారు.
- Advertisement -