Monday, January 20, 2025

నగరంలో కార్టన్ సెర్చ్

- Advertisement -
- Advertisement -

 

మనతెలంగాణ, హైదరాబాద్ : ఈస్ట్‌జోన్ పోలీసులు శనివారం అర్ధరాత్రి చాదర్‌ఘాట్ ప్రాంతంలో కార్టన్ సెర్చ్ నిర్వహించారు. కార్టన్ సెర్చెలో డిసిపి సునీల్ దత్,500మంది పోలీసులు పాల్గొన్నారు. ఆ ప్రాంతంలోని ప్రతి ఇంటిని తనీఖీ చేశారు. తెల్లవారుజామున నిర్వహించారు. సెర్చ్‌లో 10మంది అనుమానితులు, హిస్టరీ షీట్ ఉన్న వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని 45 వాహనాలను సీజ్ చేశారు. డొమెస్టిక్ సిలిండర్లను కమర్షియల్‌గా మరుస్తున్న 7ను, మద్యం 65 బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. నకిలీ ఆయిల్‌ను తయారు చేస్తున్న రాకెట్‌ను బట్టబయలు చేశారు. వారి వద్ద నుంచి 75 కిలోల ఆయిల్‌ను సీజ్ చేశారు. ఎడిసిపి శ్రీనివాస్ రెడ్డి, ఎసిపి వెంకట్ రమణ, ఎసిపి దేవేందర్, సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News