Monday, December 23, 2024

కామెడీ డ్రామా

- Advertisement -
- Advertisement -

90లలో పుట్టిన వారి అనుభవాలను తెలుపుతూ చేసిన అడ్వెంచర్స్ చిత్రమే ‘కార్టూన్స్ 90’s కిడ్స్ బే ఈడా’. దీపాల ఆర్ట్ పతాకంపై త్రిగున్, పాయల్ రాధాకృష్ణ, దీపక్ సరోజ్, హర్ష నటీనటులుగా సాయి తేజ సప్పన్న దర్శకత్వంలో శ్రీకాంత్ దీపాల, సుధీర్ రెడ్డి తుమ్మ సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలు హైదరాబాద్ లోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకుడు ఆర్‌జివి, నటులు సిద్దు జొన్నలగడ్డ, ఆకాష్ పూరి, ప్రియదర్శి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. పూజా కార్యక్రమాల అనంతరం సిద్దు జొన్నలగడ్డ హీరోహీరోయిన్లపై తొలి ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ నిచ్చారు. ఆకాష్ పూరి కెమెరా స్విచాన్ చేయగా.. ఆర్‌జివి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో చిత్ర దర్శకుడు సాయి తేజ సప్పన్న మాట్లాడుతూ “ఫ్రెండ్‌షిప్ జోనర్‌లో నేను రాసుకున్న ఈ కథ నిర్మాత శ్రీకాంత్‌కి నచ్చడంతో ఈ సినిమా చేయడానికి ఆయన ముందుకు వచ్చారు. ఫుల్ ఔట్ అండ్ ఔట్ కామెడీ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తాము”అని అన్నారు. నిర్మాత శ్రీకాంత్ దీపాల మాట్లాడుతూ “దీపాల ఆర్ట్స్ ప్రొడక్షన్‌లో నేను నిర్మిస్తున్న నాలుగవ చిత్రమిది. ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కథ”అని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరామెన్ ః చరణ్ మాధవనేని, ఎడిటర్ ః కె.బాలకృష్ణారెడ్డి, ఆర్ట్  పిఎస్ వర్మ.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News