Saturday, April 5, 2025

వినేశ్ ఫొగాట్‌కు భారీ షాక్

- Advertisement -
- Advertisement -

ఒలింపిక్స్‌లో అనూహ్యంగా అనర్హత వేటుకు గురైన భారత స్టార్ మహిళా రెజ్లర్ వినేశ్ ఫొగాట్‌కు మరో షాక్ తగిలింది. తనకు కనీసం రజత పతకం ఇవ్వాలని వినేశ్ ఫొగాట్ పెట్టుకున్న అభ్యర్థనను కోర్ట్ ఆఫ్ ఆర్బిట్రేషన్ ఫర్ స్పోర్ట్ (కాస్) తిరస్కరించింది. వినేశ్ ఫొగాట్ అప్పీల్‌పై బుధవారం కాస్ తీర్పు ఇచ్చింది. రజత పతకం ఇవ్వాలనే వినేశ్ ఫొగాట్ విన్నపాన్ని కోర్టు కొట్టి పారేసింది. పతకం ఇచ్చేందుకు కాస్ కోర్టు నిరాకరించింది. ఇదే సమయంలో వినేశ్ అభ్యర్థనను కోర్టు డిస్మిస్ చేసింది. కాగా, కాస్ తీర్పుతో వినేశ్‌తో పాటు కోట్లాది మంది భారతీయులు నిరాశకు గురయ్యారు. కాస్ వినేశ్‌కు అనుకూలంగా తీర్పు ఇస్తుందని భావించిన అభిమానులకు నిరాశే మిగిలింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News