Thursday, January 23, 2025

చార్మినార్ ఎంఎల్ఎ పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

సిటిబ్యూరోః పోలీసుల నుంచి ఎలాంటి అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించిన చార్మినార్ ఎమ్మెల్యే, అతడి కుమారుడిపై మొగపుర పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం…చార్మినార్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, అతడి కుమారుడు డాక్టర్ ఇంతియాజ్ కలిసి 150 నుంచి 200మందితో బిబి బజార్ ఎక్స్ రోడ్డు వద్ద సమావేశమయ్యారు. ప్రొటెస్ట్ ర్యాలీని వోల్టా ఎక్స్ రోడ్డు, మొగల్‌పుర నుంచి హెస్సేనీఆలం వరకు నిర్వహించారు. ర్యాలీకి రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదు. 15 నుంచి 20 బైక్‌లపై ర్యాలీ తీయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎఎస్సై రంగనాయకులు ఫిర్యాదు మేరకు ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్, అతడి కుమారుడు డాక్టర్ ఇంతియాజ్ మిగతా వారిపై ఐపిసి 143,341,290,188 రెడ్ విత్ 34 సెక్షన్నల కింది కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News