Monday, December 23, 2024

బిజెపి ఎంపి తేజస్వి సూర్యపై కేసు

- Advertisement -
- Advertisement -

మతం ఆధారంగా వోట్లు అడుగుతూ ఒక సామాజిక మాధ్యమ వేదికపై వీడియో పోస్ట్ చేశారన్న ఆరోపణపై బిజెపి ఎంపి, బెంగళూరు సౌత్ అభ్యర్థి తేజస్వి సూర్యపై ఒక కేసు నమోదు చేసినట్లు ఎన్నికల కమిషన్ శుక్రవారం వెల్లడించింది. కర్నాటక రవాణా శాఖ మంత్రి రామలింగారెడ్డి కుమార్తె, కాంగ్రెస్ అభ్యర్థి సౌమ్యా రెడ్డిపై తేజస్వి పోటీ చేస్తున్నారు. ‘ఎక్స్‌లో ఒక వీడియో పోస్ట్ చేసినందుకు, మతం ఆధారంగా వోట్లు అడిగినందుకు ఎంపి, బెంగళూరు సౌత్ పార్లమెంటరీ నియోజకవర్గం అభ్యర్థి తేజసి సూర్యపై 25న (గురువారం) జయనగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేయడమైంది’ అని కర్నాటక ముఖ్య ఎన్నికల అధికారి ‘ఎక్స్’ పోస్ట్‌లో తెలియజేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News