Wednesday, January 22, 2025

విమానం టేకాఫ్‌కు ఒత్తిడి… బీజేపీ ఎంపీలపై కేసు

- Advertisement -
- Advertisement -

Case against BJP MPs for pressuring the plane to take off

దేవ్‌గఢ్ (ఝార్ఖండ్) : చార్టర్డ్ విమానం టేకాఫ్ చేయాలంటూ అధికారులపై ఒత్తిడి తీసుకురావడంతో బీజేపీ ఎంపీలు నిషికాంత్ దూబె, మనోజ్ తివారీపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇతరుల జీవితాలకు ముప్పు వాటిల్లేలా వ్యవహరించడంతోపాటు , నియమాలు ఉల్లంఘించారన్న అభియోగాలపై ఎయిర్‌పోర్టు డీఎస్పీ ఫిర్యాదు మేరకు ఎంపీలు సహా 9 మంది పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చారు. ఝార్ఖండ్ లోని దేవ్‌గఢ్ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆగస్టు 31న లోక్‌సభ ఎంపీ నిషికాంత్ దూబె, ఆయన కుమారులు , మరో ఎంపీ మనోజ్ తివారీ తదితరులు అనుమతి లేకుండా ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ఏటీసీ) లోకి ప్రవేశించారని, తమ ఛార్టర్ విమానం టేకాఫ్ చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఒత్తిడి తెచ్చారని ఎఫ్‌ఐఆర్‌లో నమోదైంది. కొత్తగా ప్రారంభమైన విమానాశ్రయంలో రాత్రిపూట టేకాఫ్ చేసేందుకు అనుమతి లేదు. సూర్యాస్తమయానికి 30 నిమిషాల ముందు వరకు మాత్రమే టేకాఫ్ చేసేందుకు అనుమతిస్తారు.

కానీ ఎంపీలు చీకటి పడ్డాక తమ విమానం టేకాఫ్ చేయాలని ఒత్తిడి తెచ్చారని డీఎస్పీ తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై శుక్రవారం రాత్రి దేవ్‌గఢ్ కలెక్టర్ మంజునాధ్ భజంత్రీ, నిషికాంత్ దూబె మధ్య ట్విటర్ వార్ నడిచింది. జాతీయ భద్రతా నియమాలను బీజేపీ ఎంపి ఉల్లంఘించారంటూ మంజునాథ్ ట్వీట్ చేశారు. దీనిపై దూబె స్పందిస్తూ , సీఎంకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారంటూ ట్వీట్ చేశారు. అయినా ఈ అంశం దర్యాప్తు స్థాయిలో ఉందని, వాస్తవాలు బయటకొచ్చాకే మాట్లాడాలని సూచించారు. తనపై వ్యాఖ్యలు చేసేముందు ఏవియేషన్ రూల్స్ చదువుకోవాలని సూచించారు. ఈ వ్యవహారంలో పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, డీజేసీఎ జోక్యం చేసుకోవాలని అధికార జేఎంఎం డిమాండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News