Wednesday, January 22, 2025

చెల్లని చెక్కులు ఇచ్చిన సిఐడి ఉద్యోగి దంపతులపై కేసు

- Advertisement -
- Advertisement -

మనతెలంగాణ, సిటిబ్యూరోః చెల్లని చెక్కు ఇవ్వడమే కాకుండా మహిళను బెదిరించిన సిఐడిలో పనిచేస్తున్న ఉద్యోగి, అతడి భార్యపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… సిఐడిలో పనిచేస్తున్న రవికుమార్, అతడి భార్య మాధవితో కలిసి బండ్లగూడ సమీపంలోని ఓ కాలనీలో ఉంటున్నాడు. 2019, జనవరి5వ తేదీన నార్సింగి సమీపంలోని బైరాగిగూడ గ్రామంలోని 196.05 గజాల స్థలాన్ని రహమత్‌నగర్‌కు చెందిన బ్రహ్మశంకర్ నగర్ బస్తీకి చెందిన లతకు రూ.60.50లక్షలకు విక్రయించారు.

లత అడ్వాన్సుగా రవికుమార్‌కు రూ.18.50లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ చేసుకుంది. మిగతా డబ్బులు రిజిస్ట్రేషన్ సమయంలో ఇస్తామని చెప్పింది. అయితే స్థలం వివాదం కోర్టులో ఉందన్న విషయం లతకు తర్వాత తెలిసింది. దీంతో లత తను ఇచ్చిన అడ్వాన్సు డబ్బులు తిరిగి ఇచ్చేయాలని డిమాండ్ చేయడంతో మాధవి రూ.10.40లక్షలకు సంబంధించిన చెక్కులు ఇచ్చింది. చెక్కులను లత బ్యాంక్‌లో డిపాజిట్ చేయగా బౌన్స్ అయ్యాయి. దీంతో లత తన డబ్బులు ఇవ్వాలని గట్టిగా నిలదీసింది, తాను డబ్బులు ఇవ్వనని ఏమి చెసుకుంటావో చేసుకోమని మధవి బెదిరించింది. బాధితురాలు రవికుమార్, మాధవిపై మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు చేసి కేసు నమోదు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News