Monday, December 23, 2024

తండ్రిలేని చిన్నారిపై దారుణం..

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. స్థానికంగా మహిళా , శిశు సంక్షేమ శాఖలో సీనియర్ అధికారి అయిన వ్యక్తి తన స్నేహితుడి కూతురిపై నెలల తరబడి లైంగిక అత్యాచారానికి పాల్పడ్డట్లు , ఇక ఆయన భార్య ఈ మైనర్ గర్భవతి కాకుండా పిల్స్ ఇస్తూ వచ్చినట్లు వెల్లడైంది. 2020లో ఈ వ్యక్తి స్నేహితుడు చనిపోయాడు.ఈ దశలో ఇంటర్ చదువుతున్న బాలికను ఈ వ్యక్తి తన ఇంటికి తీసుకువచ్చి, తానే పోషిస్తానని మాటిచ్చి తరువాత లైంగిక చర్యలకు పాల్పడుతూ వచ్చినట్లు వెల్లడైంది. ఏడాదిగా ఆ బాలికపై ఈ వ్యక్తి తన లైంగిక వాంఛలను తీర్చుకుంటూ వచ్చాడు.

ఈ చర్యతో ఆ బాలిక గర్భం దాల్చింది. తరువాత విషయం తెలిసి భార్య ఆ చిన్నారి గర్భస్రావానికి చర్యలు తీసుకుంది. కుమారుడి ద్వారా తగు అబార్షన్ మాత్రలు తెప్పించి , ఇంట్లోనే గర్భస్రావం అయ్యేలా చేసింది. తనకు జరిగిన దారుణంపై పోలీసులకు ఎట్టకేలకు ఏదో విధంగా ధైర్యం తెచ్చుకుని బాలిక ఫిర్యాదు చేసింది. ఇప్పుడు ఈ బాలికకు చికిత్స జరుపుతున్నారు. త్వరలోనే మెజస్ట్రేట్ ముందు వాంగ్మూలం నమోదు చేస్తారు. ఈ ఇంట్లో జరిగిన అఘాయిత్యంపై ఐపిసి, పోస్కో యాక్ట్ పరిధిలో పలు కేసులు నమోదు చేశారు. ఇంట్లోకి దిక్కులేకుండా వచ్చిన బాలికపై భర్త దారుణానికి ప్రోత్సహించిన భార్యపై కూడా కేసులు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News