లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న స్టీల్ కంపెనీ సీఈవో దినేశ్ కుమార్ సరోగీపై కోల్‌కతా పోలీసులు ఆదివారం కేసు నమోదు చేశారు. ఇటీవల దినేశ్ కుమార్ తనతో అసభ్యంగా ప్రవర్తించారని కోల్‌కతాకు చెందిన ఓ మహిళ ఎక్స్ వేదికగా ఆరోపించారు. “ నేను కోల్‌కతా నుంచి అబుదాబికి విమానంలో ప్రయాణించే సమయంలో దినేశ్ కుమార్ సరోగీ అనే వ్యక్తి నా పక్క సీట్లో కూర్చున్నారు. తాను జిందాల్ స్టీల్ సీఈవోనని పరిచయం చేసుకొని మాటలు కలిపారు. అనంతరం ఆయన ఫోన్ లోని ఫోర్న్ వీడియోలు నాకు చూపిస్తూ అసభ్యంగా తాకారు. దీంతో ఒక్కసారిగా షాక్ అయ్యాను. భయంతో అక్కడి నుంచి వాష్ రూమ్‌కి పారిపోయి ఎయిర్ స్టాఫ్‌కి ఫిర్యాదు చేశాను.
దాంతో వారు నన్ను తమ సీటింగ్ ఏరియాలో కూర్చోబెట్టారు. నేను కనుపించక పోయే సరికి నాగురించి తెలుసుకోవడానికి దినేశ్ ఎయిర్‌లైన్ సిబ్బందికి పలుమార్లు ఫోన్ చేశారు” అని తెలిపారు. ఈ కేసులో నిందితుడిపై ఇప్పటికే అబుదాబి పోలీస్‌లు కేసు నమోదు చేశారు. మహిళ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా కోల్‌కతా లోని బిధాన్‌నగర్ సిటీ పోలీసులు ఆదివారం దినేశ్ కుమార్‌పై కేసు పెట్టారు. ఈ సంఘటన తరువాత బాధిత మహిళ, అతడిపై చర్య తీసుకోవాలని జిందాల్ స్టీల్ అండ్ పవర్ ఛైర్మన్, బీజేపీ ఎంపీ నవీన్ జిందాల్‌ను కోరారు. దీనిపై స్పందించిన ఆయన దర్యాప్తు చేపట్టామని, నివేదికల ఆధారంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.