Sunday, December 22, 2024

ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కొడంగల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే, పార్టీ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఓ యువకుడి ఫిర్యాదు మేరకు నారాయణపేట జిల్లా కోస్గి పోలీస్ స్టేషన్‌లో అతనిపై హత్యాయత్నం కేసు చేశారు. కాంగ్రెస్‌ పార్టీకి మద్దతు ఇచ్చినందుకే తనపై దాడి చేసి హత్య చేశారని బాధితుడు కూర నరేష్‌ ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి, 8 మంది అనుచరులు దాడి చేశారని తెలిపాడు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఏ-1గా కేసు నమోదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని కోస్గి పోలీసులు వెల్లడించారు.

కాగా, కొండంగల్‌లో ఈసారి ఎన్నికలు రసవత్తరంగా సాగుతున్నాయి. ఇక్కడ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సీఎం రేసులో ఉన్న ఆయన ఇక్కడ ఎలాగైనా గెలవాలని తహతహలాడుతున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే పట్నం నరేంద్రరెడ్డి మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇక్కడ పట్నం గెలిస్తే.. పదోన్నతి మంత్రి పదవి ఇస్తామని సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News