Monday, December 23, 2024

కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై కేసు 

- Advertisement -
- Advertisement -

సిటీబ్యూరో: భూవివాదం విషయంలో కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం… సామ ఇంద్రపాల్ రెడ్డి 2018లో ఉప్పరపల్లిలో ఓ స్థలాన్ని కొనుగోలు చేసేందుకు ప్రయ త్నించారు. భూమి విషయంలో మధ్యవర్తులుగా ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, రాకేష్ రెడ్డి వ్యవహరించారు. తమకు తెలిసిన వారి వద్ద భూమి ఉందని కొనుగోలు చేయవచ్చని ఇద్దరు కలిసి శ్రీరామ్ రెడ్డి అనే వ్యక్తిని ఇంద్రపాల్ రెడ్డికి పరిచయం చేశారు. భూమి ఇప్పిస్తామని చెప్పడంతో భూమి ధర, కమీషన్ కలిపి రూ.3.65కోట్లు అమ్ముతారని చెప్పారు.

దీనికి అంగీకరించిన ఇంద్రపాల్ వారికి 2018, మే 24వ తేదీన రూ. 90లక్షలు చెల్లించాడు, తర్వాత దశల వారీగా రూ.3.05 కోట్లు ఇచ్చాడు. మిగతా డబ్బులకు సెక్యూరిటీ కింద ఎమ్మెల్యే, రాకేష్ రెడ్డిలకు చెందిన బ్లాంక్ చెక్కులు ఇచ్చాడు. మిగతా డబ్బులు రూ.60లక్షలు బ్యాంక్ రుణం రాగానే ఇస్తానని వారికి ఇంద్రపాల్ చెప్పాడు. అయితే డబ్బులు చెల్లించడం ఆలస్యం కావడంతో ఇంద్రపాల్‌ను ఎమ్మెల్యే అనుచరులు బెదిరించడం ప్రారంభించారు. ఈ క్రమంలోనే ఇంద్రపాల్ బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో తాను కోర్టును ఆశ్రయించానని బాధితుడు ఇంద్రపాల్‌రెడ్డి తెలిపారు. కోర్టు ఆదేశాల మేరకే బంజారాహిల్స్ పోలీసులు ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి, రాకేష్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. సంఘటన ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరగడంతో కేసును ఆ పిఎస్‌కు బదిలీ చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News