Friday, January 10, 2025

బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో కెటిఆర్‌పై మరో కేసు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుస్టేషన్‌లో బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కెటిఆర్‌పై కేసు నమోదయ్యింది. అనుమతి లేకుండా ఎసిబి ఆఫీస్ నుంచి బిఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించినందుకు 221,292,126(2),r/w 3(5) బిఎన్‌ఎస్ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. కెటిఆర్‌తో పాటు మరో ఐదుగురు బాల్క సుమన్ ,మన్నె గోవర్ధన్ ,జయసింహ , క్రిశాంక్, గెల్లు శ్రీనివాస్‌పై కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ పోలీసుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. ఫార్ములా ఈ రేస్ కేసులో జనవరి 9న కెసిఆర్ ను ఎసిబి అధికారులు దాదాపు 7 గంటల పాటు విచారించారు.

విచారణ తర్వాత ఎసిబి ఆఫీస్ నుంచి బంజారాహిల్స్ లోని బిఆర్‌ఎస్ ఆఫీస్ వరకు కెటిఆర్ ర్యాలీగా వెళ్లారు. అనుమతి లేకుండా ర్యాలీ తీసి వాహనదారులకు ఇబ్బంది కల్గించడమే గాకుండా ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించినందుకు కెటిఆర్‌పై ట్రాఫిక్ పోలీసులు ఫిర్యాదు చేశారు. జనవరి 9న విచారణ తర్వాత బయటకు వచ్చిన కెటిఆర్ ఎసిబి ఆఫీస్ దగ్గర మాట్లాడుతుండగా డిసిపి అడ్డుకున్నారు. రోడ్డుపై మాట్లాడొద్దని పార్టీ ఆఫీస్‌కు వెళ్లి ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుకోవాలని కెటిఆర్‌కు సూచించారు. దీంతో మీడియాతో మాట్లాడితే మీకెందుకు భయమని డిసిపిపై కెటిఆర్ రుసరుసలాడారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News