Tuesday, January 7, 2025

సిఎంఆర్ ఘటనలో ఏడుగురిపై కేసు

- Advertisement -
- Advertisement -

పలువురిపై పోక్సో కేసు నమోదు,
ఇద్దరిని రిమాండ్‌కి తరలింపు
నిందితుల్లో ప్రిన్సిపల్, కళాశాల
డైరెక్టర్, ఇద్దరు వార్డెన్లు
బాలికల హాస్టల్ బాత్రూమ్‌లో రహస్య వీడియోల చిత్రీకరణ కేసులో పురోగతి

నిందితుల జాబితాలో విద్యాసంస్థల
కార్యదర్శి చామకూర గోపాల్‌రెడ్డి

మన తెలంగాణ/మేడ్చల్: మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా, గుండ్లపోచంపల్లి మున్సిపల్ పరిధిలోని సిఎంఆర్ ఇంజనీరింగ్ కళాశాల బాలికల వసతి గృహం బాత్రూంలో రహస్యంగా వీడియోలు తీసిన ఘటనలో ఏడుగురిపై కేసు నమోదు చేసి, ఆదివారం ఇద్దరిని రిమాండ్ తరలించినట్టు డిసిపి కోటిరెడ్డి తెలిపారు. నిందితులపై పోక్సో కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఏ 1- నంద కిషోర్ కుమార్, ఏ 2- గోవింద్ కుమార్‌ను ఎఫ్‌ఐఆర్‌లో చేర్చిన పోలీసులు సిఎంఆర్ విద్యాసంస్థల ఛైర్మన్, మాజీ మంత్రి, మేడ్చల్ ఎంఎల్‌ఎ చామకూర మల్లారెడ్డి సోదరుడు, సిఎంఆర్ విద్యాసంస్థల కార్యదర్శి చామకూర గోపాల్ రెడ్డిని ఏ7 గా, ఏ3, ఏ4లుగా బాలికల వసతిగృహం వార్డెన్‌లు అల్లం ప్రీతి రెడ్డి, ధనలక్ష్మి, ఏ5 గా ప్రిన్సిపాల్ అనంత నారాయణ, ఏ6గా కళాశాల డైరెక్టర్ మాదిరెడ్డి జంగా రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

నంద కిశోర్, గోవింద్ కుమార్ అమ్మాయిల వసతిగృహం బాత్రూమ్‌ల్లోకి తొంగిచూసినట్లు తేలిందని తెలిపారు. ఈ మేరకు వారిద్దర్నరీ రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఇదిలావుండగా, సిఎంఆర్ కాలేజీ వసతిగృహంలో రహస్య వీడియోల చిత్రీకరణ రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ నెల 2వ తేదీన బాలికల వసతి గృహం బాత్రూంలో సీక్రెట్ కెమెరాలు అమర్చినట్లు విద్యార్థినులు ఆందోళనకు దిగారు.

తాము స్నానం చేస్తుండగా వీడియోలు రికార్డ్ చేస్తున్నారంటూ విద్యార్థినులు ఆరోపణలు చేస్తూ అందోళనకు దిగగా వీరికి ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ,ఎన్‌ఎస్‌యుఐ విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున మద్దుతుగా నిలిచాయి. మూడు రోజులపాటు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో బాలికల వసతి గృహం ముందు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో యాజమాన్యం కళాశాలకు మూడురోజులపాటు సెలవు ప్రకటించి విద్యార్థినులను వసతి గృహాల నుండి వారి వారి ఇళ్లకు పంపించి వేసింది. దీంతో కొంతమేర ఆందోళనలు సద్దుమణిగాయి. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పోలీసులు కఠినంగా వ్యవహరించాలని విద్యార్థినుల తల్లిదండ్రులు కోరుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News