- Advertisement -
బ్యాంక్‌లో రూ.2.5కోట్లు రుణం తీసుకుని ఎగవేత
మనతెలంగాణ, సిటిబ్యూరో: బ్యాంక్ నుంచి రుణం తీసుకుని మోసం చేసిన కేసులో బిజెపి నాయకుడి కుమారుడిపై పంజాగుట్ట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం….బిజేపి నాయకుడి కుమారుడ నందీశ్వర్‌గౌడ్ కుమారుడు ఆశిష్ గౌడ్, మరో వ్యక్తి కలిసి భూమిని తనఖా పెట్టి సోమాజిగూడ ఎస్‌బిఐ నుంచి రూ.2.5 కోట్ల రుణం తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించకపోవడమే కాకుండా తనఖా పెట్టిన భూమిని ఆశిష్ గౌడ్ వేరే వారికి విక్రయించాడు. రుణం తీసుకున్న వ్యక్తి అప్పు తిరిగి చెల్లించకపోవడంతో బ్యాంక్ అధికారులు భూమిని స్వాధీనం చేసుకునేందుకు వెళ్లగా అసలు విషయం బయటపడింది. దీంతో సోమాజిగూడ ఎస్‌బిఐ అధికారులు పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
- Advertisement -