Wednesday, January 22, 2025

గొర్రెల పెంపకం దారులను బురిడి కొట్టించిన కేటుగాళ్లు

- Advertisement -
- Advertisement -

గొర్రెల పెంపకం దారులను కేటుగాళ్లు బురిడి కొట్టించిన సంఘటన శేరిలింగంపల్లి మండలంలోని గచ్చిబౌలిలో చోటుచేసుకుంది. గొర్రెలు పెంపకం దారుల అకౌంట్లకు వెళ్లాల్సిన డబ్బులను కేటుగాళ్లు దారి మళ్లించారు. మోసపోయామని గ్రహించిన గుంటూరు జిల్లాకు చెందిన పెంపకందారులు గచ్చిబౌలి పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తమకు రావలసిన 2 కోట్ల పైచిలుకు నగదుని దారి మళ్ళించారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

మధ్యవర్తితోపాటు పశుసంవర్ధక శాఖ ఓఎస్డి కళ్యాణ్, అధికారుల కుమ్మక్కై మోసం చేశారని ఆరోపించారు. దీంతో పశుసంవర్ధక శాఖకు చెందిన ఇద్దరు అధికారులతో పాటు మధ్యవర్తిపై పోలీసులు కేసు నమోదు చేశారు. 133 గొర్రెల యూనిట్లను కొనుగోలు చేసి అకౌంట్లో డబ్బులు వేయకుండా మోసం చేశారుని బాధితులు పేర్కొన్నారు. ఏడాదిన్నరగా అధికారుల చుట్టూ తిరుగుతున్న ప్రయోజనం దక్కలేదని రైతులు వాపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News