Wednesday, January 15, 2025

హైడ్రా కూల్చివేతలను అడ్డుకున్న ముగ్గురిపై కేసు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: మాదాపూర్ లోని సున్నం చెరువు పరిధిలోని హైడ్రా అధికారులు ఆక్రమణలు కూల్చివేస్తున్న అడ్డుకుని ఆత్మహత్యా యత్నం చేశారు ముగ్గురు. అయితే వారిపై ఇప్పుడు కేసు నమోదయింది.

అధికారుల విధులకు ఆటంకం కలిగించారని హైడ్రా అధికారులు కేసు నమోదు చేశారు. కూల్చివేతలు ప్రారంభించిన వెంటనే కిరోసిన్ తో ముగ్గురు అక్కడకు చేరుకుని ఆత్మహత్య చేసుకుంటామంటూ బెదిరించారు. ముందస్తు నోటీసు ఇవ్వకుండా ఎలా తమ ఇళ్లు కూల్చివేస్తారని నిలదీశారు. కుటుంబంతో అర్ధాంతరంగా ఎటు పోవాలంటూ గగ్గోలు పెట్టారు. దీనికి చిర్రెత్తిన అధికారులు వారిపై విధులకు ఆటంకం కల్పించారంటూ కేసు పెట్టారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News