Wednesday, January 22, 2025

కేరళ పేలుళ్లపై వ్యాఖ్యలు .. కేంద్రమంత్రిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : ప్రశాంతంగా ఉండే కేరళలో ఆదివారం చోటు చేసుకున్న పేలుళ్లు ఉలిక్కిపాటుకు గురి చేశాయి. ఈ ఘటనను ఉద్దేశించి కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై కేసు నమోదైంది. ‘వివిధ వర్గాల మధ్య విభేదాలు రెచ్చగొట్టేలా ప్రకటనలు చేశారంటూ ఆయనపై అభియోగాలు నమోదవుతున్నాయి’ అని అధికారిక వర్గాలను ఉటంకిస్తూ వార్తా ఏజెన్సీ పీటీఐ వెల్లడించింది. ఈ పేలుళ్లపై రాజీవ్ చంద్రశేఖర్ కేరళ ముఖ్యమంత్రి పినరయి పై విమర్శలు గుప్పించారు.

కేరళలో సంఘ విద్రోహ శక్తులు బలపడుతున్నాయని , అయినప్పటికీ కేరళ ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలను ముఖ్యమంత్రి పినరయి విజయన్ తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యల్లో మతపరమైన అజెండా కనిపిస్తోందని మండిపడ్డారు. ‘ ఒక బాధ్యతాయుతమైన మంత్రిగా, ఈ ఘటనను దర్యాప్తు చేస్తోన్న సంస్థలపై కొంచెమైనా గౌరవం ఉండాలి. దర్యాప్తు ప్రారంభదశలో ఉంది.

కానీ వారు మాత్రం కొన్ని వర్గాలే లక్షంగా బహిరంగ ప్రకటనలు చేస్తున్నారు.’ అని మండిపడ్డారు. కొచ్చి సమీపం లోని కలమస్సేరిలో‘ జమ్రా అంతర్జాతీయ సమావేశ కేంద్రం’ లోని ప్రార్థనా మందిరంలో ఆదివారం పేలుళ్లు సంభవించాయి. 12 ఏళ్ల బాలికతో సహా ముగ్గురు మృతి చెందారు. కనీసం 50 మంది గాయాల పాలయ్యారు. అందరూ కళ్లు మూసుకుని ప్రార్థిస్తున్న తరుణంలో ఎక్కువ తీవ్రతతో రెండు, స్వల్పస్థాయిలో ఒకటి కలిపి మొత్తం పేలుళ్లు జరిగినట్టు ప్రాథమికంగా తెలిసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News