Thursday, December 19, 2024

బెంగళూరులో విరాట్ కోహ్లి పబ్ పై కేసు

- Advertisement -
- Advertisement -

బెంగళూరు: కర్నాటక రాజధాని బెంగళూరు నగరంలో ఎంజి రోడ్డులో ఉన్న విరాట్ కోహ్లికి చెందిన ‘వన్ 8 కమ్యూన్ పబ్’, ఇతర పబ్ లపై బెంగళూరు పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ పబ్ లన్నీ నిర్ణీత సమయం దాటి రాత్రి పూట నడుస్తున్నాయి ఆరోపణ. డిసిపి సెంట్రల్ కథనం ప్రకారం అర్ధ రాత్రి 1.30 నిమిషాలు దాటి కూడా ఈ క్లబ్ లు తెరిచి ఉంటున్నాయి. వాటికి అర్ధరాత్రి 1.00 వరకు తెరిచి ఉంచే అనుమతి మాత్రమే ఉంది.

పబ్ లున్న ప్రాంతంలోని వారు రాత్రి పూట పెద్ద శబ్దంతో మ్యూజిక్ వినిపిస్తున్నారని ఫిర్యాదు చేయడంతో పోలీసులు చర్యలు చేపట్టారు.  విరాట్ కోహ్లికి చెందిన ‘వన్ 8 కమ్యూన్ పబ్’ బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్ స్టేడియం దగ్గర ఉంది. నియమాలు ఉల్లంఘిస్తున్న పబ్ లపై కేసులు నమోదు చేశారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News