Sunday, January 19, 2025

ఎంపి నవనీత్ కౌర్ పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలోని అమ్రావతి ఎంపి, బిజెపి నేత, సినీ నటి నవనీత్ కౌర్‌పై తెలంగాణలో కేసు నమోదైంది. రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె ఇటీవల షాద్ నగర్ లో పర్యటించారు. మహబూబ్ నగర్ బిజెపి ఎంపీ అభ్యర్థి డికె అరుణకు మద్దతుగా ఆమె తో కలిసి పట్టణంలోని కార్నర్ మీటింగ్ లో నవనీత్ కౌర్ ప్రసంగించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే పాకిస్తాన్ కు ఓటు వేసినట్లేనని వ్యాఖ్యానించారు. దీనిపై కాంగ్రెస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా విద్వేషపూరిత ప్రసంగం చేశారంటూ ఎన్నికల అధికారి షాద్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు ఆమెపై కేసు నమోదు చేసినట్లు షాద్ నగర్ సిఐ వెల్లడించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News