Monday, December 23, 2024

తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు.. అజ్ఞాతంలో నటి కస్తూరి

- Advertisement -
- Advertisement -

చెన్నై: నటి కస్తూరి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఇటీవల తెలుగువారిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన కస్తూరిపై కేసు నమోదు అయ్యింది. అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకే..తెలుగువారు వచ్చారంటూ కస్తూరి చేసిన వ్యాఖ్యలు పెద్ద దూమారం రేపాయి. ఆమె వ్యాఖ్యలపై తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కస్తూరిపై చెన్నై, మదురై సహా పలు ప్రాంతాల్లో కేసులు నమోదు అయ్యాయి. ఈ క్రమంలో నోటీసులు ఇచ్చేందుకు పోలీసులు వెళ్లగా.. ఆమె ఇంటికి తాళం వేసినట్లు సమాచారం. అంతేకాదు ఆమె ఫోన్ కూడా స్విచ్ఛాఫ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. దీంతో ఆమె పరారీలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News