Monday, December 23, 2024

ఈటల రాజేందర్‌పై ఓయూ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: హుజురాబాబాద్ బిజెపి ఎంఎల్‌ఎ ఈటల రాజేందర్‌పై వెంటనే క్రిమినల్ కేసు ఫైల్ చేయాలని ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు నమోదైంది. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ కాంగ్రెస్‌కు రూ.25 కోట్లు ఇచ్చారని ఈటల రాజేందర్ తప్పుడు ఆరోపణలు చేశారని, దీన్ని సీరియస్‌గా తీసుకొని కేసు నమోదు చేయాలని పిసిసి జనరల్‌సెక్రటరీ చరణ్ కౌశిక్ యాదవ్ శనివారం లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు.

ఎలాంటి ఆధారాలు లేకుండా పార్టీలపై తప్పుడు ప్రచారం చేయడం సరికాదన్నారు. దీని వలన సుమారు 40 లక్షల మంది కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయని స్పష్టం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగా ఈటల రాజేందర్ కాంగ్రెస్ పార్టీ మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారన్నారు. పార్టీ, కార్యకర్తలను అవమానించినందుకు ఈటల రాజేందర్‌పై వెంటనే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News