లేడీ సూపర్ స్టార్ నయనతార సినిమా చిక్కుల్లో పడింది. ఇటీవల నయనతార ప్రధానపాత్రలో నటించిన చిత్రం ‘అన్నపూర్ణి’. చెన్నైలో వరదల సమయంలో ఈ సినిమా థియేటర్ లో విడుదలై యావరేజ్ గా ఆడింది. అయితే, ప్రస్తుతం ఈ మూవీ తమిళంతోపాటు పలు ఇతర భాషల్లోనూ ఓటీటీలో విడుదలైంది. ఈ క్రమంలో శివసేన మాజీ నేత ఒకరు.. ఈ సినిమా హిందువుల మనోభావాలు దెబ్బతీసేలా ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తూ హీరోయన్ నయనతారతోపాటు చిత్రయూనిట్ పై కేసు పెట్టినట్లు సమాచారం.
హిందూ సమాజం మనోభావాలు దెబ్బతినేలా ఈ సినిమాలో ఏముందంటే.. ఇందులో బ్రాహ్మణ అమ్మాయిగా నటించిన నయనతార మాంసం వండటం, నమాజ్ చేయడం వంటి కొన్ని సీన్స్ ఉన్నాయట. దీంతో బ్రాహ్మణ కమ్యూనిటీని కించపరిచే విధంగా సినిమాలో సన్నివేశాలు ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఓటీటీలో ప్రసారమవుతున్న ‘అన్నపూర్ణి’ సినిమా ఆపాలని.. రాష్ట్రీయ హిందూ మహాసభ రాష్ట్రీయ ప్రతినిధులు డిమాండ్ చేస్తున్నారు. విడుదలకు ముందు కూడా ఈ సినిమాపై వివాదం నెలకొంది.