Wednesday, January 22, 2025

పోలీసులపై అనుచిత వ్యాఖ్యలు.. రేవంత్‌పై కేసు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్  ః పోలీసుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, సహకరించిన మాజీ ఎమ్మెల్యేలు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్‌లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాగర్‌కర్నూల్ ఎస్పి కె. మనోహర్ తెలిపారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఎస్పి మాట్లాడుతూ సోమవారం రోజు హైదరాబాద్ గాంధీభవన్‌లో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మహబూబ్‌నగర్ జిల్లా పోలీసులను హెచ్చరిస్తూ రెడ్ డైరీలలో మీ పేర్లు పొందుపరిచి వంద రోజుల తర్వాత తాము అధికారంలోకి వచ్చాక మీ గుడ్డలు ఊడదీసి అసలు మిత్తితో చెల్లిస్తామని

అనుచిత వ్యాఖ్యలపై జిల్లా పోలీస్ అసొసియేషన్ అధ్యక్షుడు గుణవర్ధన్ ఫిర్యాదు చేయడంతో నాగర్‌కర్నూల్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్పి వివరించారు. పోలీసుల మనోభావాలు దెబ్బతీసే విధంగా కించ పరిచే విధంగా బహిరంగ వ్యాఖ్యలు చేశారని ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఎంతటి వారిపైనైనా చట్టరిత్యా చర్యలు తీసుకుంటామని ఎస్పి అన్నారు. వీరిపై సెక్షన్ 504, 506, 153 కింద స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేసినట్లు ఎస్పి వివరించారు. రేవంత్ రెడ్డిపై భూత్పూర్, జడ్చర్ల పోలీస్ స్టేషన్లలో సైతం కేసులు నమోదయ్యాయి.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News