- Advertisement -
హైదరాబాద్: సాయి ధరమ్ తేజ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో సాయి తేజ్‌పై ఐపిసి 336, మోటార్ యాక్ట్ 184 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అతివేగం, నిర్లక్ష్యంగా బైక్ నడిపినందుకు సాయి ధరమ్ తేజ్‌పై ఈ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మరోవైపు సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనకు ఎలాంటి ప్రాణ పాయం లేదని అపోలో వైద్యులు తెలిపారు. మరో 48 గంటలపాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంచుతామని చెప్పారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యంపై వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గణనాథుడి ఆశిస్సులతో ఆయన త్వరగా కోలుకుంటాడని మంత్రి తలసాని అన్నారు.
Case filed against Sai Tej in Rayadurgam PS
- Advertisement -