Thursday, January 23, 2025

బిత్తిరి సత్తిపై సిసిఎస్‌లో కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

ప్రముఖ నటుడు బిత్తిరి సత్తి అలియాస్ రవిపై హైదరాబాద్ సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. బిత్తిరి సత్తి ఇటీవల యూట్యూబ్‌లో రిలీజ్ చేసిన వీడియోలో భగవద్గీతను కించపర్చేలా వీడియో చేశాడు. దీనిపై వానర సేన ఆగ్రహం వ్యకం చేసింది. రాష్ట్రీయ వానర సేన జాతీయ అధ్యక్షుడు నామ్ రామ్‌రెడ్డి, భగవద్గీతను కించపర్చేలా వీడియో తీసి సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్న బిత్తిరి సత్తిపై సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

హిందువుల మనోభావాలు దెబ్బతినేలా వీడియోలు చేసి వైరల్ చేస్తున్న రవికుమార్ అలియాస్ బిత్తిరి సత్తిపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఫిర్యాదు తీసుకున్న సిసిఎస్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు వెంటనే బిత్తిరి సత్తికి ఫోన్ చేసి తమ ఎదుట హాజరు కావాలని ఆదేశించారు. రెండు రోజుల్లో బిత్తిరి సత్తి సిసిఎస్ పోలీసుల ఎదుట హాజరుకానున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News