Sunday, December 22, 2024

బిఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై కేసు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : హుజూరాబాద్ బిఆర్‌ఎస్ అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారం లో భాగంగా చివరి రోజైన మంగళవారం భావోద్వేగ ప్రసంగం చేయడం ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారని కమలాపూర్ ఎంపిడివో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌశిక్ రెడ్డిపై కమలాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని హుజూరాబాద్ అధికారులను ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా, ఈ ఎన్నికల్లో తనకు ఓటు వేసి గెలిపిస్తే జైత్రయాత్ర కు వస్తానని, లేదంటే నాలుగో తేదిన మా ముగ్గురి శవయాత్రకు మీరు రావాల్సి వస్తుందని, ఏ యాత్రకు వస్తారో మీరు నిర్ణయించుకోవాలని ప్రజ లను ఉద్దేశించి కౌశిక్ రెడ్డి అన్నారు. ఈ వ్యాఖ్యలకు సంబంధించి కేసు నమోదయింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News