Sunday, December 22, 2024

మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

మహబూబ్నగర్ మాజీ ఎమ్మెల్యే మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు సిఐ అప్పయ్య తెలిపారు. మాజీ మంత్రితోపాటు మరో 20 మంది టిఆర్ఎస్ నాయకులు పై కూడా క్రైమ్ నెంబర్ 239/2024 190, 192,195, 196,292,352, బిఎన్ఎస్ కింద కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఇటీవల టిఆర్ఎస్ సోషల్ మీడియా నాయకుడు వరద భాస్కర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు .ఈ నేపథ్యంలో వరద భాస్కర్ పై అక్రమ కేసులు బనాయించారంటూ మాజీ మంత్రితోపాటు పలువురు బిఆర్ఎస్ నేతలు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ముందు ఆందోళన చేశారు. పోలీస్ స్టేషన్ ఎదుట అనుమతి లేకుండా ధర్నా చేసినందుకు మాజీ మంత్రితో పాటు పలువురుపై పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News