Friday, November 22, 2024

‘అబ్బాజాన్’అన్నందుకు ముఖ్యమంత్రిపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

Case filled on CM for abba jaan

పాట్నా: ‘అబ్బాజాన్’ అంటూ వ్యాఖ్యానించినందుకుగాను ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌పై బీహర్‌లోని ముజఫ్ఫర్‌పూర్‌కు చెందిన యువకుడు జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఉత్తరప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న దృష్ట్యా యోగి ఆదిత్యనాథ్ ఓట్లు రాబట్టుకునేందుకు ఓటర్లను ప్రభావింతం చేస్తున్నారని ముజఫ్ఫర్‌పూర్‌లోని అహియాపూర్‌కు చెందిన తమన్నా హాష్మీ సోమవారం ఫిర్యాదు దాఖలు చేశారు.
“ముఖ్యమంత్రి తన వేదిక ముందు కూర్చున్న వ్యక్తిని ఉద్దేశించి ఒక మతవర్గాన్ని కించేపరిచే విధంగా వ్యాఖ్యలు చేశారు. అలాంటి చర్య దేశంలో చీలికలు తీసుకురాగలదు. ఆయన ఓట్లు రాబట్టుకునేందుకే అలా చేశారు” అని హాష్మీ ఆరోపించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ఆదివారం కుషీనగర్‌లో ఏర్పాటుచేసిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ ప్రజలు ఇప్పుడు పొందుతున్నట్లు రేషన్ ఇక ముందు పొందలేరన్నారు. పేద ప్రజలకు ఉద్దేశించిన బియ్యం దొంగచాటుగా నేపాల్, బంగ్లాదేశ్‌లకు చేరుతున్నాయని, పేదలకు ఉద్దేశించిన బియ్యాన్ని స్వాహా చేసేవారు ఇకపై జైలుకు వెళతారు. ‘అబ్బాజాన్’ ఇదివరలో రేషన్‌లను జీర్ణించుకునేవారు అన్నారు.

ఉర్దూలో అబ్బాజాన్ అంటే తండ్రి అని అర్థం. ఇదిలా ఉండగా బిజెపికి ఎలాంటి ఎజెండా లేదని, ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఓట్లను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తోందని యోగి ఆదిత్యానాథ్ వ్యాఖ్యానాలను ఉద్దేశించి కాంగ్రెస్ సోమవారం విమర్శించింది. “యోగి ఆదిత్యనాథ్ అబ్బాజాన్, భాయ్‌జాన్, శశాన్-కబరిస్థాన్ వంటి వ్యాఖ్యలు చేసే అధికారంలోకి వచ్చారు” అని కాంగ్రెస్ ప్రతినిధి గౌరవ్ వల్లభ్ విమర్శలు చేశారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News