Thursday, January 23, 2025

ప్రేమ జంటపై దాడి చేసిన ఆరుగురు వ్యక్తులపై కేసు నమోదు

- Advertisement -
- Advertisement -

నల్గొండ : నకిరేకల్ పట్టణంలోని బొడ్రాయి బజార్ లో ప్రేమ జంటపై దాడి చేసిన ఆరుగురు వ్యక్తులపై నకిరేకల్ పోలీసులు కేసు నమోదు చేశారు. నకరేకల్ ఎస్సై శంకర్ తెలిపిన విరాల ప్రకారం నకిరేకల్ పట్టణానికి చెందిన నవదీప్ శాలిగౌరారం మండలంలోని ఊట్కూరు గ్రామానికి చెందిన కావ్య అనే అమ్మాయి గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. కావ్య మేజర్ కావడంతో వారిరువురు ఇష్టపడి పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు.

ఈ క్రమంలో నవదీప్ ను పెళ్లి చేసుకుంటానని కావ్య ఇంట్లో చెప్పడంతో తల్లిదండ్రులు అంగీకరించలేదు. గత నెల 29వ తేదీన చెరువుగట్టు దేవాలయంలో నవదీప్ కావ్య లు పెళ్లి చేసుకున్నారు. నేరుగా నకరేకల్ పోలీస్ స్టేషన్లో పోలీసులను ఆశ్రయించారు . వెంటనే ఎస్ఐ శంకర్ ఈ కుటుంబాల వారిని స్టేషన్ కు పిలిపించి కౌన్సిలింగ్ నిర్వహించారు. అయినప్పటికీ అమ్మాయి కావ్య తాను నవదీప్ తోని సంసార జీవితం సాగిస్తానని తేల్చి చెప్పింది.

అనంతరం ఇరువురు కలిసి నవదీప్ ఇంటికి వెళ్లారు. దీంతో శాలిగౌరారం మండలం ఊట్కూరు గ్రామానికి చెందిన అమ్మాయి తల్లిదండ్రులు, కుటుంబీకులు ఇతరులు ఆగ్రహంతో శుక్రవారం నవదీప్ ఇంటికి వెళ్లి కర్రలు, రాళ్లతో అబ్బాయి కుటుంబ సభ్యులపై దాడి చేసి తీవ్రంగా కొట్టారు. నవదీప్ తల్లి ఫిర్యాదు మేరకు దాడి చేసిన జహంగీర్, వరికుప్పల వెంకన్న, వరికుప్పల వెంకటేశ్వర్లు, విజయ్, అశోక్ ,రాజు ల పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నకిరేకల్ పట్టణ ఎస్సై శంకర్ తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News