Tuesday, November 5, 2024

గురుపత్వంత్ సింగ్ పన్నున్‌పై పంజాబ్‌లో కేసు

- Advertisement -
- Advertisement -

అమృత్‌సర్ (పంజాబ్): మతం, తెగ పేరున వివిధ వర్గాల మధ్య శత్రుత్వం పెంచుతున్నాడన్న ఆరోపణలపై ఖలిస్థాన్ అనుకూల నేత గురుపత్వంత్ సింగ్ పన్నున్‌పై పంజాబ్ పోలీస్‌లు కేసు నమోదు చేశారు. ఈమేరకు ఈనెల 23న అమృత్‌సర్ సుల్తాన్‌విండ్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. సామాజిక మాధ్యమాల్లో పన్నున్ పోస్ట్ చేసిన వీడియోలో అమృత్‌సర్ లోని శ్రీ దుర్గియానా మందిర్‌కు హిందూ మతంలో చారిత్రక గుర్తింపు ఏదీ లేదని , అందువల్ల ఆ ఆలయాన్ని మూసివేసి తాళాలు స్వర్ణదేవాలయానికి అప్పగించాలని ఆలయ యాజమాన్యాన్ని హెచ్చరించాడు.

ఈ సామాజిక మాధ్యమం లో విడుదలైన వీడియో ప్రకారమే కేసు నమోదు చేసినట్టు పోలీస్‌లు చెప్పారు. వివిధ వర్గాల మధ్య శత్రుత్వం, విద్వేషం , అశాంతి, వదంతులు వ్యాపింప చేస్తున్నాడన్న ఆరోపణలపై 153 ఎ,153 బి, 505,ఐపిసి సెక్షన్ల కింద కేసు దాఖలైంది. సిక్సు ఫర్ జస్టిస్‌లో పంజాబ్ గ్యాంగ్‌స్టర్లు చేరి రిపబ్లిక్ డే వేడుకల్లో రాజకీయ నాయకులు పాల్గొనకుండా చేయాలని పంజాబ్ సిఎం భగవంత్ మాన్, పోలీస్ చీఫ్ గౌరవ్‌యాదవ్‌లకు ప్రమాదకరమైన హెచ్చరికలు జారీ చేశాడు. సెక్యూరిటీ లేకుండా రిపబ్లిక్‌డే వేడుకల్లో పాల్గొనాలని ప్రధాని మోడీని సవాలు చేశాడు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News